రాష్ట్రీయం

ఉరకలెత్తిన ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు క్యూలుకట్టారు. 119 నియోజకవర్గాలకు మొత్తం 1076 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. దీనిని బట్టి పోటీ చేసేందుకు చాలామంది ఉత్సాహంగా ఉన్నారన్నది స్పష్టం అయ్యిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వ్యాఖ్యానించారు. ఇలాఉండగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తారు. ఆ జాబితాను స్క్రీనింగ్ కమిటీకి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అందజేస్తారు. అభ్యర్థుల సామాజిక, ఆర్థిక, అంగబలం, కుల బలబలాలనూ పరిగణనలోకి తీసుకుంటారు. అంతేకాకుండా వివిధ సర్వేలను, పార్టీకి ఉండే అవగాహన, అభ్యర్థుల సేవా భావం, పార్టీకి అంకితమైన భావంతో పని చేసే వ్యక్తేనా? తదితర అంశాలనూ పరిశీలిస్తారు. పీసీసీ అధ్యక్షుడు ఈ సర్వే రిపోర్టును పార్టీ అధిష్ఠానం ముందు పెట్టి ఆమోదం తీసుకుంటారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించే నాటికి పొత్తులు, సీట్ల సర్దుబాట్లు పూర్తి చేసుకుని జాబితా విడుదల చేయాలని ఉత్తమ్ భావిస్తున్నారు.
కాంగ్రెస్‌లో చేరిన బందూలాల్
నగరంలోని కార్వాన్ నియోజకవర్గానికి చెందిన మజ్లీస్ నాయకుడు బందులాల్ శనివారం కాంగ్రెస్‌లో చేరారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బందులాల్‌కు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.