రాష్ట్రీయం
ఎవరైనా శవం అయిపోవల్సిందే..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 24 September 2018
విశాఖపట్నం, సెప్టెంబర్ 23: ఎవరూ ఊహించని ఘటన జరిగిపోయింది. ప్రజల్లో మమేకమై తిరుగుతున్న ఎమ్మెల్యే తమ మధ్య లేరన్న నిజాన్ని అరుకు ప్రాంతవాసులు నమ్మలేకపోతున్నారు. అరుకులో శనివారం జరిగిన ఒక కార్యక్రమానికి ఎమ్మెల్యే కిడారి హాజరయ్యారు. ఏజెన్సీలో విషజ్వరాల బారిన పడిన వారికి వీలైతే సహాయం చేయాలని, వీటిని కూడా రాజకీయాలు చేయవద్దంటూ ప్రతిపక్షాలకు హితవు పలికారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తప్పుపట్టండి. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పుడు మీరు కూడా సహకరించండి. ముందు వెనుకల తేడాతో ఎప్పటికైనా ఎవరైనా శవమైపోవల్సిందే. ఈ మధ్య ఉన్న సమయంలో మంచి పనులు చేద్దాం అంటూ కిడారి చెప్పిన మాటలను అభిమానులు నెమరు వేసుకుంటూ కంటతడి పెడుతున్నారు.
ఎమ్మెల్యే కిడారి (ఫైల్‌పొటో )