రాష్ట్రీయం

హౌరాలో ఆందోళన.. పలు రైళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: దీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మంగళవారం హౌరాలో ఆదివాసీలు చేపట్టిన ఆందోళనతో రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హౌరా నుంచి దేశం నలుమూలకు నడిచే పలు రైళ్ళు మంగళవారం రద్దయ్యాయి. హౌరా-సికింద్రాబాద్ (18645), హౌరా-చెన్నై (12841) కోరమండల్ ఎక్స్‌ప్రెస్, హౌరా-కన్యాకుమారి (12665) ఎక్స్‌ప్రెస్‌లు రద్దయ్యాయి. హౌరా-యశ్వంత్‌పూర్ (12863), అమరావతి (18047), ముజఫర్‌పూర్-యశ్వంత్‌పూర్ (15228), హౌరా-చెన్నై (12839) మెయిల్, యశ్వంత్‌పూర్-హౌరా (12864), ఫలక్‌నుమా (12703), చెన్నై-పూరి (22860)లను రద్దు చేసినట్టు వాల్తేరు డివిజన్ అధికారులు ప్రకటించారు. వీటితోపాటు మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు 10నుంచి 15 గంటలపాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. విశాఖ మీదుగా హౌరాకు వెళ్ళాల్సిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ను మంగళవారం ఉదయం అనకాపల్లి స్టేషన్‌లోనే నిలిపివేశారు. తివేండ్రం-గౌహతి (15829) పది గంటలు ఆలస్యంగా నడుస్తోంది. తిరుపతి-చంత్రగాచీ (22856) 12 గంటలు, గౌహతి-బెంగుళూరు (12510) ఎనిమిది గంటలు, వివేకా కన్యకుమారి ఎక్స్‌ప్రెస్ (15906) 17 గంటలపాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. చెన్నై-హౌరా మెయిల్ (12840) పది గంటలు, పురివిల్లా-విల్లుపురం (22605) 17 గంటలు, సికింద్రాబాద్-సాలిమర్ (12774) నాలుగు గంటలు ఆలస్యమవుతున్నట్టు సంబంధిత అధికారి తెలిపారు. ఫలక్‌నుమా (12703) 30 గంటలు ఆలస్యం నడుస్తోంది. మరికొన్ని దారి మళ్ళింపులో నిర్వహిస్తుండగా మరో రెండు రోజులపాటు రైళ్ళ రాకపోకలకు అంతరాయం తప్పదని అధికారులు చెబుతున్నారు. విశాఖ నుంచి హౌరా వైపుగా ప్రయాణించే వారంతా తమ రిజర్వేషన్ టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. హౌరా-విశాఖ మధ్య నడిచే పలు రైళ్ళు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. చెన్నై, బెంగళూరు, సికింద్రాబాద్, ముంబయి నుంచి బయలుదేరి విశాఖ మీదుగా హౌరా వైపు వెళ్ళే రైళ్ళు రద్దు చేయడంతో మార్గ మధ్యలోనే వందలాది మంది ప్రయాణికులు తిరుగు ముఖం పడుతున్నారు.