ఆంధ్రప్రదేశ్‌

10 వేల పేద బ్రాహ్మణులకు లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 10 నెలల వ్యవధిలో 10,593 మంది పేద బ్రాహ్మణులకు,వారి పిల్లలకు ఏపి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రూ.50 కోట్లను వివిధ పథకాల కింద అందజేశామని కార్పొరేషన్ ఎండి చెంగవల్లి వెంకట్ వెల్లడించారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బ్రాహ్మణుల కోసం నిర్దేసించిన వివిధ పథకాల్లో అర్హులైన వారికి బ్యాంకుల ద్వారా అందించామన్నారు. చిత్తూరు జిల్లా నుంచే 473 మంది బ్రాహ్మణ లబ్ధిదారులకు రుణాలు ఇచ్చామన్నారు. వశిష్ట కోచింగ్ స్కీమ్ ద్వారా బ్యాంకింగ్, సివిల్ రంగాల్లో పరీక్షలు రాసేందుకు 56 మందికి విజయవాడ, ఢిల్లీ హైదరాబాద్ కేంద్రాల్లో శిక్షణ ఇచ్చామన్నారు. ద్రోణాచార్య పథకం కింద ఇంజినీరింగ్ చదవి నిరుద్యోగులుగా ఉన్న బ్రాహ్మణులకు శిక్షణ ఇచ్చామన్నారు. వారం క్రితం చాణిక్య పథకం కింద సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకున్న బ్రాహ్మణులకు రూ.10లక్షలు వ్యయం అయితే అందులో రూ.2లక్షలు కార్పొరేషన్ ద్వారా అందించామని అన్నారు. రూ. 3లక్షలతో వ్యాపారం చేస్తామంటే అందులో 50శాతం కార్పొరేషన్ ద్వారా అందించామన్నారు. 900 దరఖాస్తులు తమకు అందాయని తెలిపారు. చేతక్ హెల్పింగ్ స్కీమ్ కింద నిరుపేదలైన బ్రాహ్మణులకు రెండున్నర లక్షల రూపాయలు ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేశామన్నారు.