ఆంధ్రప్రదేశ్‌

తరగతుల వారీగానే పుస్తకాల ‘బరువు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లలకు వారి సామర్థ్యానికి మించి పుస్తకాలను పాఠ్యాంశాలుగా చేర్చలేదని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శాసనమండలిలో శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి సభ్యుడు ఎంవివిఎస్ మూర్తి తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, ఒకటి, రెండు తరగతులకు మూడు పాఠ్యపుస్తకాలు, మూడు, నాలుగు, ఐదు తరగతులకు నాలుగు పుస్తకాలు ఉన్నాయన్నారు. అలాగే ఆరు, ఏడు తరగతులకు ఆరు పుస్తకాలు, ఎనిమిది నుండి పదో తరగతి వరకు ఎనిమిది పాఠ్యపుస్తకాలు నిర్దేశించామని వివరించారు.
ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు నిర్దేశించిన పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలతో కూడిన బ్యాగులను విద్యార్థులు మోయలేకపోతున్నారని ఎంవివిఎస్ మూర్తి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అరటిపళ్లకు కనీసమద్దతు ధర (ఎంఎస్‌పి) ఏదీ లేదని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పి. శమంతకమణి తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, అనంతపురం జిల్లాలో అరటిపళ్లను మాగబెట్టేందుకు (పరిపక్వత) 15 మెగా టన్నుల నిలువ సామర్థ్యంతో ఏడు గోదాములు ఉన్నాయన్నారు.
పంటలకు గిట్టుబాటు ధరను అందించేందుకు రాష్ట్రప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మహ్మద్ జానీ తదితరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, రైతులకు కనీస మద్దతు ధర లభించేలా అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు.
ఆయుర్వేద, హోమియో, యునాని వైద్యుల నియామకాన్ని ఇక నుండి ఎపిపిఎస్‌సి ద్వారా చేస్తామని వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. గతంలో కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్ విధానంలో పనిచేస్తున్న 256 మంది ఆయుష్ డాక్టర్ల సర్వీసులు రెగ్యులరైజ్ చేశామన్నారు.