ఆంధ్రప్రదేశ్‌

మానవ విలువల పునరుద్ధరణకు నడుంకట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్): సంఘంలో నానాటికీ తరగిపోతున్న ఉత్తమ మానవీయ విలువల పునరుద్ధరణకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర ప్రాంగణంలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ స్ఫూర్తి అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. సభకు అలహాబాద్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధి జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ గతంలో గౌరవం అనేది ప్రతిభతో వచ్చేదని, కానీ నేటి రోజుల్లో డబ్బుతోనో, అధికారంతోనో వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశాన్ని, సమాజాన్ని చాలాకాలంగా పట్టిపీడిస్తున్న రుగ్మతల్లో కులవ్యవస్థ ఒకటన్నారు. ప్రస్తుత వ్యవస్థలో మార్పు రావాల్సినటువంటి అగత్యం, ఆవశ్యకం ఎంతైనా ఉందని, మానవుడిని మానవుడుగా సమాజ శ్రేయోదాయకుడిగా ప్రేమించి గౌరవించాల్సి ఉందని, అంతేకాకుండా తోటివాడి సంక్షేమానికి చేయూతనివ్వాలన్నారు. స్ఫూర్తి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం ద్వారా దాతృత్వ గుణసంపన్నుడైన బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి అవార్డు గ్రహీతలను జ్యూరీ సభ్యులతో కలిసి ఎంచుకున్న తీరు ఎంతైనా ముదావహమన్నారు. రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ త్యాగధనులను, సేవా పరాయణులను వారు చేసినటువంటి సంఘ సేవను గుర్తుంచుకుని అవార్డులతో, నగదు పురస్కారాలతో సత్కరిస్తున్న కృష్ణమూర్తిని కొనియాడారు.

మంత్రి రాఘవరావు చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న పాలేకర్