ఆంధ్రప్రదేశ్‌

ఇమేజ్ పెరిగిందా, డామేజ్ జరిగిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాసనసభనుంచి రోజాను సంవత్సరంపాటు సస్పెండ్ చేయడం, ఆ వ్యవహారం కోర్టుకెక్కడంవంటి పరిణామాలపై అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఆత్మ పరిశీలనలో పడ్డారు.
ప్రతిపక్ష పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు అధికారపక్షం బయటకు బీరాలు పలుకుతున్నా, పలువురు టిడిపి ఎమ్మెల్యేలు అంతర్గతంగా ఈ అంశంపై తీవ్రంగానే చర్చించుకుంటున్నారు. శాసనసభలో జగన్‌ను పూర్తి స్థాయిలో నిలువరించాలన్నది తెలుగుదేశం పార్టీ ప్రయత్నం. సభారంభం నుంచి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ సమావేశాల్లో రోజా వ్యవహారం తెర మీదకు రాకపోతే, సభలో ప్రతిపక్షాన్ని అధికారపక్షం పూర్తిగా బుల్డోజ్ చేసే పరిస్థితులు ఉండేవి.
ఎమ్మెల్యే రోజాను సభ నుంచి సంవత్సరంపాటు సస్పెండ్ చేయడాన్ని కొందరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకించారు. సభాపతి తీసుకున్న నిర్ణయాన్ని వేలెత్తి చూపడం సాధ్యం కాకపోవడం, అందులోనూ అధికారంలో ఉన్నందువలన దీని గురించి బహిరంగంగా మాట్లాడలేకపోయారు. ఇప్పుడిప్పుడే కొంతమంది టిడిపి ఎమ్మెల్యేలు ఈ విషయమై గుసగుసలాడటం మొదలుపెట్టారు. శాసనసభలో రోజా అనుచిత వ్యాఖ్యలు చేసిందువలన ఏడాదిపాటు సస్పెండ్ చేసి, సభాగౌరవాన్ని కాపాడటం ద్వారా అధికారపక్షం ఇమేజ్ పెరిగిందని టిడిపిలోని పెద్దలు భావిస్తున్నారు. ఇందులో ఏంత వాస్తవం ఉంది? అసలు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మనసులలో ఏముంది?
‘రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసి తప్పు చేశాం. ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని, ఏదోవిధంగా రోజాను తిరిగి సభలోకి రానిస్తే బాగుండేది. అలా చేయనందువల్ల ఈ వివాదం మరింత జటిలమైంది’ అని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు అన్నారు.
‘చంద్రబాబుకు బద్ధ శత్రువులైన వారిని కూడా ఆయన పార్టీలోకి తీసుకుంటున్నారు. అటువంటప్పుడు ఈ వివాదం మరింత ముదిరిపోకుండా, ఉభయ పక్షాలకు ఆమోదయోగ్యమైన మార్గాన్ని అనే్వషిస్తే బాగుంటుంది’ అని మరో ఎమ్మెల్యే అన్నారు.
‘ఇరు పక్షాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో అధికారపక్షం వెనక్కు వెళితే, రోజా వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన మహిళా ఎమ్మెల్యేలకు పార్టీ ఏం సమాధానం చెపుతుంది? అలాగని చూస్తూ ఊరుకుంటే పార్టీ డేమేజ్ అయిపోతోంది’ అని టిడిపికి చెందిన ఒక ఎమ్మెల్యే అన్నారు.
‘డిసెంబర్ 18న రోజా సభలో వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. ఆమె చేష్టలను వీడియో క్లిప్పింగుల్లో చూసిన వైకాపా ఎమ్మెల్యేలే ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వారు కూడా పెదవి విప్పలేకపోతున్నారు. రోజాను సంవత్సరంపాటు సస్పెండ్ చేసినప్పుడే టిడిపికి డేమేజ్ జరుగుతోందని భావించాం. ఇప్పుడు కోర్టు ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని వైకాపా ప్రజల్లోకి వెళ్లిపోతోంది. దీన్ని అడ్డుకోపోతే, ఇబ్బందుల్లో పడతాం’ అని అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే అన్నారు.
మరోపక్క కొంతమంది మంత్రులు ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ రోజా దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే, భవిష్యత్‌లో మరికొంతమంది సభలో ఇలానే వ్యవహరించే ప్రమాదం ఉందని అన్నా రు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో రోజా సస్పెన్షన్‌పై సభలో నిర్ణయం తీసుకున్నారు. తిరిగి ఆమెను సభలోకి అనుమతించాలా? వద్దా? అన్న అంశాన్ని సభలోనే చర్చించుకోవాలని ఉంది. దీన్ని ఇరు పార్టీలు ఒక అవకాశంగా తీసుకోవాలని ఒక మంత్రి అన్నారు. ఎవరికి వారు ప్రతిష్ఠలకు పోకుండా, చర్చలతోనే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూ చించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. శాసనసభలో ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షం ఒక సభ్యురాలి కోసం కాలాన్ని వృథా చేస్తోందన్న వాదన జనాల్లోకి వెళ్లకముందే నాయకుడు మేల్కోవాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. రోజా వ్యవహారంతో పార్టీకి ఇమేజ్ పెరిగిందనుకోవడం లేదని ఒక ఎమ్మెల్యే అన్నారు. శాసనసభలో రోజా చేసిన వ్యాఖ్యలను భూతద్దంలో చూపిస్తే, పార్టీ డేమేజ్ అవుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మొన్నటి హైకోర్టు ఉత్తర్వుపై అధికార పక్షం కోర్టుకెక్కుతోంది. పొరపాటున అక్కడ తమ పార్టీకి చుక్కెదురైతే వైకాపాకు, జగన్ వ్యక్తిగత ఇమేజ్‌కు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. ‘రోజా వివాదంతో పార్టీకి ఇమేజ్ పెరిగిందని అంతగా చెప్పలేం. ఇది వ్యక్తిగతమైపోయింది. అయితే, పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించక తప్పదు కదా!’ అని వైకాపాకు చెందిన ఒక ఎమ్మెల్యే చెప్పడం గమనార్హం.