బిజినెస్

రాష్ట్రానికి స్టెంట్ ప్లాంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టి ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు మరో ప్రముఖ సంస్థ ముందుకొచ్చింది. హార్ట్ స్టెంట్ల తయారీలో పేరుపొందిన ఎస్‌ఎంటి (సహజానంద మెడికల్ టెక్నాలజీస్) ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో రూ.250 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్టు మంగళవారం ప్రకటించింది. తద్వారా మినిమల్లీ ఇనే్వసివ్ లైఫ్ సేవింగ్ మెడికల్ డివైజెస్ తయారీకి సంబంధించిన ప్లాంటును ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భార్గవ్ కటడియా బృందం పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో మంగళవారం సమావేశమయ్యారు. తమ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 2500 మందికి ఉద్యోగాలతో పాటు పరోక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు వివరించారు. సుల్తాన్‌పూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన మెడికల్ డివైజెస్ పార్క్‌లో ఈ మెగా ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మొత్తం మూడు దశలలో ఏడాదికి 1.25 మిలియన్ స్టంట్‌లు, రెండు మిలియన్ల బెలూన్ కాతీటర్స్‌ను తయారు చేయనున్నట్టు కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఇప్పటివరకు సూరత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తాము హైదరాబాద్‌లో ఇంత పెద్ద భారీ పెట్టుబడి పెట్టడానికి అనేక కారణాలు దోహదం చేసాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల
స్నేహపూర్వక విధానాలతో పాటు టీఎస్-ఐపాస్, వౌలిక సదుపాయాలు ఇందుకు కారణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడానికి అవలంబిస్తున్న విధానాలు బాగున్నాయని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భార్గవ్ వివరించారు. ఎస్‌ఎంటి కంపెనీ భారీ పెట్టుబడి పెట్టడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేసారు.