తెలంగాణ

సంక్షేమంలో మేటి తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి మరే రాష్ట్రం కూడా సాటిలేదని శాసనసభలో పాలకపక్షం కొనియాడింది. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, స్ర్తి, శిశు సంక్షేమానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన బడ్జెట్ పద్దులపై శాసనసభలో ఆదివారం చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ సభ్యుడు గువ్వల బాల్‌రాజు మాట్లాడుతూ భూమి లేని నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఉచితంగా మూడు ఎకరాల భూమిని పంపిణీ చేస్తుందన్నారు. దేశంలో ఇలాంటి పథకం మరే రాష్ట్రంలోనైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. ఇంటింటికి మంచినీటిని ఇచ్చేందుకు రూపొందించిందే మిషన్ భగీరథ పథకం అని ఆయన కొనియాడారు. ఇంటింటికి మంచినీటిని ఇవ్వని పక్షంలో వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని కెసిఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను దశల వారీగా నిర్మించి ఇవ్వడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయిందని ఆయన అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో లక్ష ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో మరో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నట్టు బడ్జెట్‌లో ప్రతిపాదించిందని గువ్వల పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ వర్గాలలో పేద ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకాన్ని బిసిలతో పాటు ఇతర కులాలల్లోని పేదలందరికీ వర్తింప చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మైనార్టీల సంక్షేమానికీ తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు. తమ ప్రభుత్వానికి అన్ని వర్గాలు దగ్గర కావడాన్ని ఓర్వలేకనే విపక్షాలు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. సంక్షేమంపై చర్చ పూర్తి కాకముందే స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.

12 బస్సులు సీజ్

హైదరాబాద్, మార్చి 20: రోజురోజుకూ బస్సు ప్రమాదాలు పెరుగుతుండడంతో హైదరాబాద్ నగరంలో కాలం చెల్లిన బస్సులపై అధికారులు దృష్టి సారించారు. పాత బస్సులు, పర్మిట్ లేని బస్సులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఆదివారం నగరంలో ఆర్టీఏ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 12 బస్సులను సీజ్ చేశారు. అదేవిధంగా స్కూళ్లు, కళాశాలలకు చెందిన బస్సులను కూడా తనిఖీ చేస్తున్నట్టు ఆర్టీఏ అధికారి రఘునాథ్ తెలిపారు.బస్సుల తనిఖీ వారం రోజుల పాటు కొనసాగుతుందని, బస్సుల ఓనర్‌షిప్, పర్మిట్, ఫిట్‌నెస్ వంటి వాటిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు.