రాష్ట్రీయం

భారత రాయబారులతో కోడెల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 11: రష్యా, కజికిస్థాన్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గురువారం అక్కడి భారతదేశ రాయబారులు వెంకటేష్, ప్రభాత్‌కుమార్‌లతో సమావేశమయ్యారు. నూతన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. ఆర్థికలోటులో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరును రాయబారులకు వివరించారు. పెట్టుబడుల విషయంలో ఏపీకి అండగా ఉండాలని కోరారు. అనంతరం కజికిస్థాన్‌లో తెలుగు విద్యార్థుల సమస్యలపై రాయబారి ప్రభాత్‌కుమార్‌తో చర్చించారు. కజికిస్థాన్‌లో తెలుగు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టూరిజం, ఫార్మారంగాల్లో నవ్యాంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను వివరించారు. సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల పరిధిలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేస్తున్న సేవలను రష్యాలోని భారత రాయబారి వెంకటేష్ గుర్తుచేసుకున్నారు. గ్రామీణాభివృద్ధితో పాటు స్వచ్ఛ్భారత్, మరుగుదొడ్ల నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధి, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో స్పీకర్ కోడెల కృషిని రాయబారులు కొనియాడారు. నవ్యాంధ్రప్రదేశ్‌కు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కాగా ఈనెల 13వ తేదీన స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏపీకి తిరిగిరానున్నారు.