రాష్ట్రీయం

బాలాత్రిపుర సుందరిగా దుర్గమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 11: ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో రెండవ రోజైన గురువారం శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ అశేష భక్తకోటికి దర్శనమిచ్చింది. గురువారం ‘బాబా‘కి ప్రీతిపాత్రం కావటంతో నగరంలోని పలు బాబా మందిరాలను సందర్శించిన భక్తులు సైతం పెద్ద సంఖ్యలో దుర్గమ్మను దర్శించుకోటానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము మూడు గంటల నుంచే దర్శనానికి అనుమతి ఇవ్వటంతో భక్తులు అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో బారులు దీరారు. ఇదే సమయంలో పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, ఈవో కోటేశ్వరమ్మల నేతృత్వంలో ఆయా శాఖల అధికారులు క్యూలైన్లలో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తగు చర్యలు తీసుకున్నారు. దీని వల్ల కెనాల్ రోడ్డులోని వినాయకగుడి వద్ద క్యూలైన్ నుంచి వచ్చే భక్తులు సరిగ్గా గంటలోపుగానే దర్శనం చేసుకునే అవకాశం లభిస్తోంది. చివరి రోజు వరకు ఇదే విధంగా సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. మలేసియా పర్యటన ముగించుకుని వచ్చిన కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెల్లవారుజాము నుంచే క్యూలైన్లను పరిశీలించి నేరుగా భక్తులతో మాట్లాడారు. మరో వైపు మహామండపంలో ఉత్సవమూర్తులకు ఉభయదాతల ఆధ్వర్యంలో కుంకుమపూజ జరిగింది. ఇలాఉంటే అన్నవరం దేవస్థానం తరపున ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పీ నారాయణ, సినీ నటుడు పృధ్వీరాజ్ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిన రాజప్ప మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల నుంచి రాష్ట్రాన్ని ఆదుకోవాలని దుర్గమ్నను ప్రార్థించానన్నారు. ఇక్కడ ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయని అన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ తొమ్మిది రోజుల్లో దాదాపు 15 లక్షల మంది భక్తులు హాజరుకాగలరనే అంచనాతో తగు ఏర్పాట్లు చేసి సౌకర్యాలు కల్పించామన్నారు. ఉత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం దుర్గమ్మ శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తకోటికి దర్శనమివ్వనుంది.