రాష్ట్రీయం

జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన మీడియా స్థితిగతులపై స్వతంత్ర కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా పరిస్థితులు, జర్నలిస్టుల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన స్వతంత్ర కమిషన్ ఏర్పాటైంది. మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా (మెఫి) ఏర్పాటు చేసిన ఈ స్వతంత్ర కమిషన్‌లో కేంద్ర పబ్లిక్ కమిషన్ మాజీ సభ్యుడు, ద్రవిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ కెఎస్ చలం, పాత్రికేయులు చెన్నమనేని రాజేశ్వర్‌రావు సభ్యులుగా ఉంటారని మెఫి చైర్మన్ కె శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ సభ్యులతో ఆదివారం హైదరాబాద్‌లో మెఫి సమావేశమై అధ్యయనం చేయాల్సిన అంశాలపై చర్చించినట్టు తెలిపారు. తెలంగాణలో గత నాలుగైదేళ్ళలో 220 మంది జర్నలిస్టులు మృతి చెందిన నేపథ్యంలో అధ్యయనానికి స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో కమిషన్ పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేస్తుందని తెలిపారు.

చిత్రం...జస్టిస్ సుదర్శన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిషన్‌తో
ఆదివారం జరిగిన సమావేశంలో ప్రసంగిస్తున్న మెఫి ప్రతినిధులు