రాష్ట్రీయం

ప్రజా ప్రతినిధులకు మరింత రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్య అనంతరం ఎమ్మెల్యేల భద్రత మరింత కట్టుదిట్టం చేశామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంగళవారం ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీ ఎమ్మెల్యేల హత్య కిరాతక చర్యగా పేర్కొంటూనే, మావోయిస్టులు తమ పంథా మార్చుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, మావోయిస్టులు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. అలాకాకుండా హింసను అనుసరిస్తే వారి చర్యలకు అడ్డుకట్టవేస్తామని హెచ్చరించారు. ప్రజలు కూడా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఏజెన్సీలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై దృష్టి సారించామన్నారు. గంజాయి సాగు, రవాణాలో పోలీసులు గిరిజనులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారంటూ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. గంజాయి రవాణ చట్టరీత్యా నేరమని, అందుకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ అంశంలో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తిలేదన్నారు.