రాష్ట్రీయం

కాళరాత్రిగా శ్రీశైల భ్రమరాంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం అక్టోబర్ 16: శ్రీశైలంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం భ్రమరాంబిక అమ్మవారు కాళరాత్రి అలంకారంలో భక్తులకు దరనమిచ్చారు. మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్లకు గజ వాహన సేవ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు మంగళవారం ఉదయం విశేష పూజాకార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని కాళరాత్రి అలంకారంలో సుందరంగా అలంకరించారు. నవదుర్గ అలంకారాల్లో ఏడో రూపం కాళరాత్రి, ఈ దేవి నల్లటి దేహఛాయతో జుట్టు విరియబోసుకొని పెడబొబ్బ నవ్వుతో గార్ధ్భ వాహనరూఢియై చూడటానికి భయంకరంగా ఉంటుంది. చతుర్భుజాలు కలిగిన అమ్మవారు కుడివైపు అభయహస్తం, వరద ముద్ర, ఎడమవైపుఖడ్గం, లోహకంటకాన్ని ధరించి ఉంటుంది.