రాష్ట్రీయం

స్వర్ణరథంపై వేంకటాద్రీశుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 17: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన బుధవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు శ్రీవారు బంగారురథంలో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. దాసభక్తుల నృత్యాలతోనూ, భజనబృందాల కోలాహలం, మంగళవాయిద్యాల నడుమ తిరుమాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణరథాన్ని లాగారు. శ్రీవారికి శ్రీదేవిభూదేవి ఇరుపక్కలా ఉంటారు. శ్రీదేవి (లక్ష్మి), సువర్ణమయి. ఆమె బంగారు కాగా- ఆమెను భరించే స్వామికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందం. బంగారం శరీరాన్ని తాకుతుంటే శరీరంలో రక్తప్రసరణ చక్కగా జరుగుతుంది. బంగారం మహాశక్తిమంతమైన లోహం. స్వామివారికి కృష్ణావతారంలో దారుకుడు సారథి. ఇంట పాత్రలు బంగారువి. సింహాసనం బంగారుది. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. స్వర్ణమంటే బాగా ప్రకాశించేది అని వ్యుత్పత్తి. స్వర్ణం లభించేది భూమినుండే.