రాష్ట్రీయం

జనసేన వైపు.. మాజీల చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 21: జనసేన పార్టీలోకి మాజీ ప్రజాప్రతినిధులు పోటాపోటీగా చేరుతున్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీల్లో ఓ వెలుగు వెలిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రస్తుతం ఆయా పార్టీలను వీడి జనసేనలోకి క్యూకట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా సెంటిమెంట్ జిల్లాగా పేరొందిన తూర్పుగోదావరిలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పవన్‌కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేనలో చేరుతున్న మాజీలలో కొందరు గతంలో వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో అనేకసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికై, మంత్రులుగా ఓ వెలుగు వెలిగారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆయా నియోజకవర్గాల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలువురు మాజీలు జనసేనలో చేరుతున్నట్టు స్పష్టమవుతోంది. కాకినాడ ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ పనిచేసిన ముత్తా గోపాలకృష్ణ ఇటీవల జనసేనలో చేరారు. ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్న వెంటనే రాజకీయ సలహా కమిటీలో ముత్తాను సభ్యుడిగా పవన్‌కళ్యాణ్ నియమించారు. కాకినాడ సిటీ అసెంబ్లీ టిక్కెట్‌ను ఇపుడు ముత్తా ఆశిస్తున్నారు. కోనసీమ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పి గన్నవరం మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేనలో చేరారు. జిల్లాలోని మెట్ట ప్రాంతానికి చెందిన పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు.