తెలంగాణ

పోటీ చేస్తా, అభ్యర్థులను గెలిపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పార్టీ కోరితే తప్పకుండా పోటీ చేస్తా, ప్రచారంలో పాల్గొంటా, అభ్యర్ధులను గెలిపిస్తా అని స్వామి పరిపూర్ణానంద పేర్కొన్నారు. గురువారం రాత్రి ఆయన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ , ఇతర సీనియర్ నాయకులతో భేటీ అయ్యారు. రానున్న రోజుల్లో ఎన్నికల ప్రచారం, తన పాత్ర గురించి ఆరా తీశారు. అంతకు ముందు పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆయన తెలుగుతల్లి సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పరిపూర్ణానంద నివాళులు అర్పించారు. అలాగే గన్‌పార్కు వద్ద ఉన్న అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీరామానంద తీర్థకు కూడా ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన అక్కడ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
అంబేద్కర్ ఆశీస్సులు తీసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరమని వ్యాఖ్యానించారు. జగన్‌పై జరిగిన దాడిపై స్పందిస్తూ ఎవరూ ఇటువంటి భౌతిక దాడులకు పాల్పడరాదని అన్నారు. పార్టీ ఆదేశాలను తాను శిరసావహిస్తానని, పార్టీ పోటీ చేయమని చెబితే తాను పోటీ చేస్తానని, పొటీ చేసేవారిని గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటానని అన్నిరు. తెలంగాణలో మిషన్ 70 ప్రకారం అన్ని సీట్లలో తాము గెలుస్తామని వ్యాఖ్యానించారు.

చిత్రం..గన్‌పార్కు వద్ద నివాళులర్పిస్తున్న పరిపూర్ణానంద