తెలంగాణ

జగన్‌పై దాడి ఓ జగన్నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: ఆంధ్రప్రదేశ్‌లో కుటిల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని, జగన్‌పై దాడి ఒక జగన్నాటకమని ఏపీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ ఎయిర్‌పోర్టులో పథకం ప్రకారమే సీసీ కెమరాలు పనిచేయకుండా చేశారని అన్నారు. జగన్‌పై దాడి డ్రామా అని తేలుతోందని, అందుకే దెబ్బ తగలగానే జగన్ హైదరాబాద్ వెళ్లిపోయారని అన్నారు. ఈ దాడికి ప్రధాని మోదీ డైరెక్షన్ చేస్తే కథ, స్క్రీన్‌ప్లే జీవీఎల్ నర్సింహరావు చేశారని, విజయసాయిరెడ్డి, వైఎస్ జగన్, శ్రీనివాస్‌లు నటించారని ఎద్దేవా చేశారు. జగన్ కుట్రను ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబుపై కక్షతో ఈ స్కెచ్ వేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూశారని అన్నారు. ఈ కథను విజయవాడలోని రహస్య ప్రాంతంలో రచించారని ఆరోపించారు. కాగా, దాడి జరిగిన వెంటనే హైదరాబాద్‌కు వెళ్లడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఏపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. గాయమైన కత్తికి విషం ఉందని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, అలాంటపుడు విశాఖలో ఆస్పత్రికి వెళ్లకుండా, హైదరాబాద్ ఎందుకు వెళ్లారని నిలదీశారు. చంద్రబాబుకు వస్తున్న స్పందనను నీరుగార్చేందుకే ఈ కుట్ర పన్నుతున్నారని అన్నారు. గవర్నర్ వ్యవహరిస్తున్న తీరును ఎవరూ హర్షించరని, ఎమ్మెల్యే బుగ్గనకు తెలియక, గవర్నర్ వ్యవహార శైలిని సమర్ధిస్తున్నారని, ఇది ఇంకా అనుమానాలకు తావిస్తోందని అన్నారు. గవర్నర్ కేంద్రానికి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని చెప్పా రు. విమానాశ్రయం కేంద్రప్రభుత్వ భద్రతా దళాల ఆధీనంలో ఉంటుందని, అది తెలియకుండానే కొంత మంది మాట్లాడుతున్నారన్నారు.