రాష్ట్రీయం

ఆహ్లాదంగా ‘హ్యాపీనెస్ట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాజధాని అమరావతిలో ఆహ్లాదకరంగా ఉండేలా హ్యాపినెస్ట్ ఫ్లాట్లను నిర్మించాలని, ముందుగా 300 ఫ్లాట్ల బుకింగ్ శుక్రవారం ప్రారంభించాలని సీఆర్‌డీఏ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో గురువారం ఆయన సీఆర్‌డీఏపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాజధానిలో వివిధ విభాగాల్లో నిర్మిస్తున్న గృహాలు, రహదారులు తదితర వౌలిక సదుపాయాల ప్రగతిని సమీక్షించారు. హ్యాపీనెస్ట్‌లో
ముందుగా 300 ఫ్లాట్లను విక్రయానికి ఉంచి, మరో 300 ఫ్లాట్లను బఫర్‌గా ఉంచుకోవాలన్నారు. ఈ 600 గృహాల బుకింగ్ పూర్తయితే, మరో 600 యూనిట్లను బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు. హ్యాపీనెస్ట్ ఫ్లాట్ల కొనుగోలుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. గత వారం తమకు 17 వేల ఫోన్ కాల్స్ వచ్చాయని ముఖ్యమంత్రికి సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీ్ధర్ తెలిపారు. హ్యాపీనెస్ట్ ఫ్లాట్లలో సామాజిక వౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కోరారు. మొదటి వచ్చిన వారికి మొదటి కేటాయింపు ప్రాతిపదికన పూర్తి పారదర్శకత పాటించాలన్నారు. అవసరమైతే ఐఏఎస్, ఐపీఎస్‌లకూ ఈ తరహా గృహాలను నిర్మిస్తామన్నారు. భూమి ధరను పరిగణలోకి తీసుకుని ధర నిర్ణయించాలన్నారు. గరిష్ఠంగా చదరపు అడుగుకు 4000 నుంచి 7000 రూపాయల లోపు ఉండేలా ధర నిర్ణయించాలని సూచించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మరో 1200 ఫ్లాట్లను నిర్మించవచ్చన్నారు.
హైదరాబాద్‌లో కొన్ని న్యాయపరమైన వివాదాల వల్ల తమకు ఇళ్లు రాలేదని, అందువల్ల తమకు అమరావతిలో ఇళ్లు కేటాయించాలని ఎన్టీవోలు కోరుతున్నారని, రాయితీలు కూడా అడుగుతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి కమిషనర్ తీసుకువెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ, ఎన్జీవోల వేతన స్కేళ్లకు అనుగుణంగా స్థలాల కేటాయింపునకు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలన్నారు. రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న నిర్మాణాలకు మూనవ వనరులు ఎప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా పెంచుకోవాలన్నారు. వారం రోజుల్లో మానవ వనరుల లభ్యత పెంచుతామని మంత్రి నారాయణ తెలిపారు. విభాగాలన్ని సమన్వయంతో పని చేస్తే, లక్ష్య సాధన కష్టం కాదని సీఎం వ్యాఖ్యానించారు.
గృహ నిర్మాణ పనులు వేగవంతం
రాష్ట్రంలో గృహ నిర్మాణ పనులను సమీక్షిస్తూ, జనవరి 19లోగా 1.2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. గృహ నిర్మాణ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరగడానికి వీలు లేదని స్పష్టం చేశారు. వనరుల సమీకరణకు తాను సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. సీఆర్‌డీఏ తదుపరి సమావేశంలో రహదారులు, ఇతర వౌలిక సదుపాయాల గురించి సమీక్షిస్తానని తెలిపారు. వీటిని నిర్దేశిత కాలంలోగా పూర్తి చేయాలన్నారు. ఇందులో ఎటువంటి రాజీ లేదన్నారు.
హ్యాపినెస్టు ఫ్లాట్ల నిర్మాణంపై కమిషనర్ శ్రీ్ధర్ వివరణ ఇస్తూ, డిసెంబర్ 15 నాటికి మొదటి టవర్‌లో 24 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేస్తామని, జనవరి 1న ప్రారంభోత్సవం చేద్దామని సీఎంకు సూచించారు. నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహ రూపకల్పన పనులు, శాఖమూరు పార్క్ నమూనాపై సీఎం పలు సూచనలు చేశారు.

గ్రామీణ ప్రాంతాల సుందరీకరణకు ప్రాధాన్యం
గ్రామాల్లో నివాస ప్రాంతాలను సుందరంగా, గేటెట్ కమ్యూనిటీలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇది తదుపరి ప్రాధాన్యత అంశమని వెల్లడించారు. ప్రణాళికాబద్ధంగా పని చేయడం వల్లనే విజయవాడలో క్రమంగా సుందరీకరణ పనులు పూర్తి అవుతున్నాయన్నారు. అందమైన చిత్రాలతో గోడలను తీర్చిదిద్దడం సాధ్యమవుతోందన్నారు. విజయవాడ నుంచి గుంటూరుకు, గన్నవరం నుంచి విజయవాడ వరకూ సుందరీకరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక ప్రణాళిక ప్రకారం చేస్తే నగరాలనైనా, గ్రామాలనైనా చూడముచ్చటగా తీర్చిదిద్దవచ్చాన్నారు. అన్ని గ్రామాల సుందరీకరణకు అవసరమైన మొక్కలు నాటాలని, అన్ని గ్రామాలను గేటెడ్ కమ్యూనిటీలుగా తీర్చిదిద్దాలన్నారు. గ్రామాలు నందనవనాల్లా కనిపించాలన్నారు.
నగరంల కాలువల సుందరీకరణకు అడ్డంగా ఉన్న అవరోధాలను తొలగించాలని ఆదేశించారు. అమరావతి నగరంలో ప్రవేశించే ముఖద్వారం అనివృద్ధి కూడా ముఖ్యమేనన్నారు. రాజధాని ప్రాంతంలోని కొండ ప్రాంతాలను నోటిఫై చేసి, అభివృద్ధి చేయాలన్నారు. కొండ ప్రాంతాల అభివృద్ధి పర్యాటక రంగానికి దోహదం చేస్తుందన్నారు. అమరావతి పరిసరాల్లో హోటళ్ల నిర్మాణం వేగవంతం చేయలాని, 10 వేల గదులు త్వరగా అందుబాటులోకి తేవాలన్నారు. ఒక కనె్వన్షన్ సెంటర్‌ను కూడా పూర్తి చేయాలన్నారు. రహదారులు, ఇతర వౌలిక సదుపాయాల కల్పనకు మానవ వనరులను పెంచుకోవాలన్నారు. పనుల లక్ష్యాల మేరకు పూర్తి చేసేందుకు మానవ వనరులు అవసరమన్నారు. సీఆర్‌డీఏకు సంబంధించి వివిధ పనుల్లో 11,237 మంది కార్మికులు అవసరం కాగా, 8428 మంది పని చేస్తున్నారని క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీ పార్థసారథి తెలిపారు. పనివారి లభ్యత తక్కువగా ఉందని తెలిపారు.
చిత్రం..ఉండవల్లి ప్రజావేదికలో గురువారం సీఆర్‌డీఏపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు