రాష్ట్రీయం

గజ్వేల్ నుంచి గద్దర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: గజ్వేల్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రజాగాయకుడు గద్దర్ ప్రకటించారు. గురువారం ఆయన సీఈఓ రజత్‌కుమార్‌ను కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ లేఖ అందించారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, భావస్వేచ్ఛ ప్రకటన ప్రతి ఒక్కరి హక్కన్నారు. నమ్మిన సిద్ధాంతాన్ని అమలు చేస్తూ, చివరి రక్తపుబొట్టు చిదిమే వరకు పోరాటం చేయాలన్నదే తన ఉద్దేశమన్నారు.
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కలవడం వెనుక రాజకీయ ప్రయోజనమేమీ లేదని గద్దర్ స్పష్టం చేశారు. ఈ అంశంపై తనపై లేనిపోని దుష్ప్రచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుతూ రాహుల్ గాంధీకి వివరించానని అన్నారు. ప్రతి సారి ఎన్నికల్లో ఫ్యూడలిస్టులకు-ఇంపీరయలిస్టులకు మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందన్నారు. ఈ నెల 15 తర్వాత రాష్ట్ర వ్యాక్తంగా ఎస్‌టీ, ఎస్‌సీ తదితర నియోజక వర్గాల్లో తిరుగుతూ ఓటు హక్కు వినియోగంపై ప్రచారం చేస్తానని తెలిపారు. తనపై తెలంగాణతో పాటు ఏపీలో కూడా అనేక కేసులు నమోదై ఉన్నాయని, ఎన్ని కేసులు ఉన్నా భయపడబోనని తెలిపారు. శాంతిచర్చలు, స్థూపం ఆవిష్కరణల సందర్భంగా తనపై నమోదైన కేసులను ఎత్తివేసినట్టు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారన్నారు.