క్రైమ్/లీగల్

యారాడ బీచ్‌లో ఆరుగురు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక (విశాఖ): విశాఖ జిల్లా యారాడ బీచ్‌లో ఆదివారం ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, గజఈతగాళ్లు అనే్వషణ చేస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు అనే్వషణ చేసినప్పటికీ యువకులు ఆచూకీ లభ్యం కాలేదు. విశాఖపట్నం హెచ్‌బికాలనీకి సమీపంలో గల చాకలిపేట, దుర్గానగర్ ప్రాంతానికి చెందిన 12 మంది యువకులు ఆదివారం ద్విచక్ర వాహనాల్లో యారాడ బీచ్‌కు చేరుకున్నారు. 12 మంది యువకులూ ఐటిఐ చదువుతున్నవారే. స్నేహితుల్లో ఒక్కరికి జన్మదినం కావడంతో వారంతా యారాడ బీచ్‌కు చేరుకుని మధ్యాహ్నాం భోజనం పూర్తి చేసుకున్నారు. అనంతరం ఇద్దరు యువకులు ఒడ్డునే ఉండగా 10 మంది యారాడ బీచ్‌లో స్నానానికి దిగారు. ఆరుగురు యువకులు కాస్త లోపలికి వెళ్లారు. ఈ తరుణంలో మృత్యు కెరటం ఒక్కటి వారిపై విరుచుకు పడి లోపలికి లాక్కుపోయింది. సముద్రంలోకి కొట్టుకుపోతున్న విషయాన్ని గమనించి ఒడ్డున ఉన్నవారు పెద్దగా కేకలు పెట్టారు. వెంటనే తీరంలోగల కమ్యూనిటీ గార్డులు ఆరుగురులో నలుగురు యువకులను రక్షించారు. అయితే దుర్గానగర్‌కు చెందిన దేవర వాసు (21), అదే కాలనీకి చెందిన పేరిడి తిరుపతి (21), హెచ్‌బికాలనీ చాకలిపేటకు చెందిన కోన శ్రీనివాసరావు (21), నక్కా గంగేష్ (17), దుర్గా (21), ఎస్.రాజేష్ (21) గల్లంతయ్యారు. బాలుతోపాటు మరో ముగ్గుర్ని కమ్యూనిటీ గార్డులు రక్షించారు. బీచ్‌లో జరిగిన సంఘటనను పహారీ కాస్తున్న న్యూపోర్టు పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఎసిపి రంగరాజుతోపాటు ఇన్‌స్పెక్టర్లు సోమశేఖర్, సాయి, సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే చీకటి పడడంతో అనే్వషణ నిలిపివేశారు. సోమవారం నేవీ అధికారుల సహాయంతో యువకుల ఆచూకీ కోసం అనే్వషణ చేస్తామని పోలీసులు తెలిపారు. యారాడ బీచ్‌లో వారి కుమారులు గల్లంతు అయ్యారని తెలుసుకున్న తల్లిదండ్రులు, వారి కుటుంబీకులు అత్యధికంగా అక్కడికి చేరుకున్నారు. గల్లంతైన కుమారులు కోసం తీరంలోనే వారివారి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.