రాష్ట్రీయం

భారీ ర్యాలీలతో బీజేపీ నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: తెలంగాణ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే తొమ్మిది మంది బీజేపీ అభ్యర్ధులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ముషీరాబాద్ నుండి డాక్టర్ కే లక్ష్మణ్, మలక్‌పేట నుండి ఎ జితేంద్ర, సనత్‌నగర్ నుండి ఏ విజయ, గోషామహల్ నుండి టీ రాజాసింగ్, చార్మినార్ నుండి టీ ఉమామహేందర్, దుబ్బాక నుండి ఎం రఘనందన రావు, రామగుండం నుండి వనితా బాల్‌మూరి, మునుగోడు నుండి డాక్టర్ గంగొడి మనోహర్‌రెడ్డి, పరకాల నుండి పెసరు విజయ్ చందర్ రెడ్డి తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు విజయోత్సవ హంగామా చేశారు. ఒక పక్క తప్పెడు గుళ్లు, బాజా భజంత్రీలు, టపాసులు కాలుస్తూ ర్యాలీలుగా ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు చేరుకుని కుటుంబ సభ్యులు, కార్యకర్తల సమక్షంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ముషీరాబాద్ అభ్యర్థిగా డాక్టర్ కే లక్ష్మణ్ తన సతీమణితో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాం అహిర్, ఎంపీ దత్తాత్రేయ, జీ కిషన్‌రెడ్డి , ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, పార్టీ ప్రధానకార్యదర్శి పి మురళీధరరావు తదితరులు లక్ష్మణ్ నామినేషన్ల కార్యక్రమానికి హాజరయ్యారు. లోయర్ ట్యాంక్‌బండ్ విజయ గణపతి ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుండి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి ముషీరాబాద్ ఎమ్మార్వోకు తమ నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అత్యంత కీలకమైన పాత్ర పోషించనుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పేదల సంక్షేమానికి తీసుకున్న ఎన్నో కార్యక్రమాలు, పథకాలు వారి జీవితాల్లో వెలుగు నింపాయని , వారంతా తిరిగి బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేకపోయిన కేసీఆర్‌కు ఓట్లు అడిగే హక్కు లేదని, టీఆర్‌ఎస్ - కాంగ్రెస్‌లు బొమ్మా బొరుసు పార్టీలు మాత్రమేనని, కుటుంబ పాలన పోవాలంటే టీడీపీ -కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లను ఓడించాలని అన్నారు. ఎన్‌టీఆర్ ఆశయాలను చంద్రబాబు తూట్లు పొడిచారని , డబ్బుతో ప్రజలను ఏ పార్టీ ఏమార్చలేదని వ్యాఖ్యానించారు.
గోషా మహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ ఆకాశ్‌పుర హనుమాన్ దేవాలయం నుండి ర్యాలీగా వెళ్లి అబిడ్స్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. జిల్లాల్లో కూడా పలువురు బీజేపీ అభ్యర్ధులు తమ నామినేషన్లను దాఖలు చేశారు.
చిత్రం..నామినేషన్ దాఖలు చేసేందుకు ముషీరాబాద్ ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్