రాష్ట్రీయం

గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 14: గజ్వేల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ గురువారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయేందర్‌రెడ్డికి అందజేశారు. మొదటి నామినేషన్ పత్రాలను కేసీఆర్ మధ్యాహ్నం 2.33 గంటలకు అందజేయగా, 2వ సెట్‌ను 2.35 గంటలకు రిటర్నింగ్ అధికారికి అందించారు. ఈ సందర్బంగా కేసీఆర్ రాజ్యాంగం సాక్షిగా అంటూ ఎన్నికల ప్రమాణం చేయగా, ఆయన నామినేషన్ పత్రాలను మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ మణికొండ లక్ష్మికాంతారావు, నాచగిరి ట్రస్టుబోర్డు చైర్మెన్ కొట్టాల యాదగిరి ప్రతిపాదించారు. అలాగే ఎన్నికల ఎజెంట్‌గా వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మెన్ జహంగీర్ వ్యవహరించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మెన్లు బూపతిరెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మెన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ భాస్కర్, వైస్ చైర్మెన్ అరుణ భూపాల్‌రెడ్డి, జెడ్‌పీటీసీలు వెంకట్‌గౌడ్, సింగం సత్తయ్య, ఎంబరి రాంచంద్రం, అయ్యగల్ల పోచయ్య, చిట్టి మాధురి, ఎంపీపీలు చిన్నమల్లయ్య, రాదాకిషన్‌రెడ్డి తదితరులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు.