రాష్ట్రీయం

సమర్థులకే అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ప్రజలకు దూరమైన బీజేపీ, వైసీపీ, జనసేన * ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలతో టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు
అమరావతి, నవంబర్ 14: సమర్థులైన అభ్యర్థుల ఎంపికతోనే ఎన్నికల్లో విజయం సులభమవుతుంది.. సరైన కసరత్తు లేకుండా ఎంపికచేస్తే టీఆర్‌ఎస్ లానే ఇబ్బందిపడాల్సి వస్తుంది.. నా వద్ద సర్వేలు, నివేదికలు ఉన్నాయి.. పూర్తిస్థాయిలో ప్రజల్లో విశ్వసనీయత ఉన్నవారికే సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బుధవారం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం రోజుకు 74వేల వరకు సభ్యత్వ నమోదు జరుగుతోందని ఇకపై రెట్టింపు చేయాలని ఆదేశించారు. రోజుకు లక్షన్నర సభ్యత్వం నమోదు కావాలని నిర్దేశించారు. అప్పుడే నమ్ముకున్న లక్ష్యానికి చేరుకోగలమన్నారు. డిసెంబర్ 15 కల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. కోటి మందితో అతి పెద్ద పార్టీగా సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి వారం లక్ష్యాలను నిర్దేశించు కోవాలన్నారు. పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తున్నా.. ప్రభుత్వం పై ఇప్పటి వరకు 78 శాతం సంతృప్తి ఉంది.. పార్టీ పట్ల నూరుశాతం ప్రజల్లో నమ్మకం కలగాలన్నారు. వారానికి రెండు శాతం మాత్రమే గ్రామవికాసం జరుగుతోందని దీన్ని 10 రెట్లు అధికం చేయాలన్నారు. గ్రామాలను సందర్శించటంలోనే గొప్ప అనుభూతి ఉంటుందని వచ్చే పది రోజుల్లో గ్రామవికాసాన్ని ముమ్మరం చేయాలన్నారు. దేశానికి తెలుగుదేశం పార్టీ దిక్సూచిగా మారిందని ఆతీయ రాజకీయాల్లో కీలక భూమిక వహిస్తున్నట్లు చెప్పారు. దేశ ప్రయోజనాలు, రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసమే కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రధాన కారణమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రజాస్వామ్యాన్ని మంటకలుపుతోందని ధ్వజమెత్తారు. అన్ని వ్యవస్థలను పతనంచేసి ప్రత్యర్థి పార్టీలపై కక్షసాధింపు ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించారు. అందుకే ప్రజలకు బీజేపీ పూర్తిస్థాయిలో దూరమవుతోందని తెలిపారు. దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. దేశానికి కష్టం వచ్చినప్పుడు బాధ్యత చేపట్టాం.. అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నా.. అన్ని పార్టీల నేతలను కలుస్తున్నా..నా విశ్వసనీయత వల్లే అంతా కలసి నడిచేందుకు ముందుకు వస్తున్నారని స్పష్టంచేశారు. విర్రవీగితే ఏం జరుగుతుందో మూడు పార్టీలే ఉదాహరణ అన్నారు. ఈ కారణంగానే బీజేపీ, టీఆర్‌ఎస్, వైసీపీ ప్రజలకు దూరమయ్యాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో అహంభావానికి తావులేదన్నారు. బడుగు, బలహీనవర్గాలకు అండగా తమ పార్టీ భరోసా ఇస్తుందన్నారు. టీడీపీలోనే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు భద్రత ఉంటుందన్నారు. ఏపీలో జరిగిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక అవార్డులు సాధించామని నియోజకవర్గాల వారీగా సాధించిన ప్రగతిని ప్రజల్లోకి బలంగా ప్రచారం చేయాలన్నారు. కేంద్రం పోలవరానికి ఇంకా రూ 3200 కోట్లు ఇవ్వాలి.. రాజధాని నిర్మాణానికి సహకరించలేదు.. కేంద్రం సహకరించకపోయినా 66 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తున్నాం.. ఏడాదికి రూ 65వేల కోట్లు పేదల సంక్షేమానికి ఖర్చు పెడుతున్నాం.. ఈ విషయాలన్నింటినీ ప్రజలకు వివరించాలని ఉద్బోధించారు. రాష్ట్రంలో కొద్దినెలల్లోనే సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.. కార్యకర్తలు, నాయకుల్లో ఉత్సాహం పరవళ్లు తొక్కాలి.. ఈ ఐదేళ్లలో పెద్దఎత్తున పదవులు ఇచ్చాం.. రాబోయే రోజుల్లో కూడా మీ కష్టానికి తగిన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల నాటికల్లా పార్టీ యంత్రాంగం యావత్తు బలోపేతం కావాలన్నారు. ఈలోగా రెండు, మూడు దశల్లో శిక్షణా కార్యక్రమం, బూత్ కన్వీనర్లు, సేవా మిత్రలకు శిక్షణ పూర్తి చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 2500 మంది సేవామిత్రలకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈనెల 16వ తేదీకల్లా బూత్ కన్వీనర్ల నియోమకం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రజల పట్ల బాధ్యత, సమిష్టి కృషివల్లే టీడీపీ ఈ స్థాయికి చేరిందని స్పష్టం చేశారు.