రాష్ట్రీయం

బెదిరింపులకు భయపడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 16: బీజేపీని అంత తేలిగ్గా వదలబోనని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఈ గడ్డపై పుట్టిన వారెవరూ బీజేపీని సమర్థించరు.. స్వార్థం కోసం రాజకీయాలు చేయకూడదు.. కేంద్రంలోని బీజేపీ ఏపీకి తీరని ద్రోహం చేసింది.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ఓట్లు వేయించుకుంది.. ఐదేళ్లు కూడా ఇవ్వకుండా మోసగించింది.. అదేమని తిరగబడితే దాడులకు దిగుతోంది..నేను ఎవరికీ భయపడను.. బీజేపీని అంత తేలిగ్గా వదలబోనని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.. ఉండవల్లి ప్రజావేదికలో విజయనగరం జిల్లాకు చెందిన బీజేపీ, విశాఖపట్నానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు శుక్రవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అవలంబిస్తున్న విధానం సరైందా కాదా అనేది ప్రశ్నించు కోవాలన్నారు. ఏపీ బీజేపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకుని మనస్సాక్షి ప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు. కేంద్రం ఇచ్చిన హామీలన్నింటినీ వడ్డీతో సహా వసూలుచేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడతారో.. బీజేపీ హైకమాండ్‌కు ఊడిగం చేస్తారో రాష్ట్ర నేతలు తేల్చుకోవాలన్నారు. బెదిరింపులకు నేను భయపడేవాడిని కాదు.. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఎవరికీ భయపడలేదు.. ప్రజల కోసం పోరాటమే తెలుగుదేశం పార్టీ విధానమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు.. కానీ జీతాలు మాత్రం తీసుకుంటారు.. తిత్లీ తుపాను బాధితులను కనీసం పరామర్శించే మనసులేదని విమర్శించారు. ప్రజా సమస్యలపై పనిచేయని వాడు నాయకుడే కాదన్నారు. బాధల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇవ్వలేనిది రాజకీయ పార్టీ కాదన్నారు. తిత్లీ తుపానులో శ్రీకాకుళం కకావికలం అయింది.. బాధితులను ప్రతిపక్షనేత కనీసం పరామర్శించలేదు.. ప్రభుత్వ సాయం కూడా అందకుండా చేయాలని కుట్ర పన్నారు.. ఒడిశా వాళ్లతో గొడవలు సృష్టించాలని ప్రయత్నించారు.. ప్రజల పట్ల కనీస బాధ్యత వైసీపీకి లేదని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్షనేత జగన్, జనసేన అధినేత పవన్ నన్ను నిందించటమే పనిగా పెట్టుకున్నారు.. బీజేపీకి మేలు చేయటమే ఆ ముగ్గురి అజెండా అని వ్యాఖ్యానించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రూ. 70వేల కోట్లు రావాలని కమిటీ వేసి తేల్చిన పవన్ ఇప్పుడెందుకు అడగరని ప్రశ్నించారు. అవినీతి రహిత రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంటే అవినీతి ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. బోఫోర్స్ కుంభకోణం ఎంతో పవన్ తెలుసుకోవాలన్నారు. ఢిల్లీ వస్తా..అవిశ్వాసం పెట్టిస్తా.. అని ప్రగల్భాలు పలికి అవిశ్వాసం రోజున పత్తాలేరని విమర్శించారు. కష్టపడి ఏపీని అభివృద్ధి చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు నిందిస్తాడో అర్థం కాదన్నారు. మధ్యంతర ఎన్నికలు ఎందుకో ఆయనకే తెలీదని ఎద్దేవా చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేయాలన్నారు.. ఎన్డీఏ నుంచి బైటకు రావాలన్నారు.. అవిశ్వాసం పెట్టమన్నారు.. వాళ్లు చెప్పినవన్నీ చేశాం.. వాళ్లు మాత్రం గోదా వదిలేసి పరారయ్యారని విమర్శించారు. టీడీపీ అవిశ్వాసానికి 15 పార్టీల మద్దతిచ్చాయి.. 126 మంది ఎంపీలు అండగా నిలబడ్డారు.. కానీ వైసీపీ మాత్రం పారిపోయిందన్నారు. వైసీపీ ఎంపీలు పత్తాలేకుండా పోయారన్నారు. అప్పుడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విధానం ఒక్కటే అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవాలనేదే తమ సంకల్పమన్నారు. అడ్డంకులు తాత్కాలికమే.. సమస్యలన్నీ కారుమబ్బులే .. త్వరలో వీటన్నింటినీ అధిగమిస్తాం.. తిరుగులేని శక్తిగా ఏపీని తీర్చిదిద్దుతాం.. ఈ కృషిలో అందరి ప్రజలంతా సహకరించాలని కోరారు.