రాష్ట్రీయం

కేసీఆర్ ఇంట్లోనే బంగారు తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడింది బీజేపీయే * బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్
భైంసా రూరల్, నవంబర్ 17: నాలుగున్నరేళ్లలో అధికారంలో ఉన్న టీ ఆర్ ఎస్ సర్కారు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మార్చుతామని చెప్పి ఇప్పుడు కేసీ ఆర్ తన ఇంట్లోనే బంగారు తెలంగాణ ఏర్పాటుచేసుకున్నారని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్ విమర్శించారు. శనివారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వ్యవసాయ కాటన్ యార్డులో నిర్వహించిన బీజేపీ ఎన్నికల బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీ ఆర్‌ఎస్ సర్కారు తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసం చేసిందన్నారు. గత ఎన్నికల్లో భగవద్గీత లాంటి హామీలును ఇచ్చి విస్మరించారని ఆరోపించారు. కేజీటుపీజీ ఉచిత విద్య హామీని నెరవేర్చలేకపోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులు బీజేపీకి ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా మతతత్వ పార్టీ ఎంఐఎంతో టీఆర్ ఎస్ పొత్తు పెట్టుకుందన్నారు. సిద్ధ్దాంతాలను వెన్నుపోటు పోడిచినది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. తన గద్దెనే కాపాడుకోలేని బాబు దేశాన్ని ఉద్దరిస్తాడట అని విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం బీజేపీపోరాడిందని గుర్తుచేశారు. బతుకమ్మ పండుగతో ఆడపడుచులను కించపర్చే ఎం ఐ ఎంతో దోస్తీచేయడం ఎంతవరకు సమంజసమన్నారు. తెలంగాణను బంగారు తెలంగాణగా చేస్తామని చెప్పి అప్పుడే షురుచేశానని అంటున్నాడన్నారు. ఐదేళ్లు పాలించుమని తెలంగాణ ప్రజలు అధికారం పెడితే చాతగాక కేసీ ఆర్ నాలుగున్నరేల్లకే తన ప్రభుత్వాన్ని రద్దుచేసుకున్నారని ఎద్దేవాచేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రవేశ పథకాల్లో కేంద్రం వాటా ఉందన్నారు. పెద్ద ఎత్తున కేంద్రం నిధులు ఇస్తే ఏం ఇచ్చిందని కేసీఆర్ మాట్లాడడం సరికాదన్నారు. వ్యాపారులకు ఏప్రభుత్వం ఇవ్వని రుణాలు ముద్ర పథకం ద్వారా బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో కేసీ ఆర్‌ను ఇంటికి పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముధోల్ నియోజకవర్గంలో బీజేప జెండా ఎగురవేయాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ స్వల్ప మెజార్టీతో ఓటమి పాలైందని, ఈసారి జరిగే ఎన్నికల్లో మూడింతలు ఎక్కువగా ఓట్లతో మెజార్టీ సాధించి బీజేపీని గెలిపించాలన్నారు. నియోజకవర్గ ప్రజలంతా బీజేపీవైపే ఉన్నారని, ఈ సారి ఘన విజయం ఖాయమన్నారు.
ఒకసారి అవకాశం ఇవ్వండి
70 ఏళ్లలో ముధోల్ నియోజకవర్గం ఎక్కడ ఉంటుందో తెలియని ఈరోజుల్లో బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ ముధోల్ అభ్యిర్థి పడకంటి రమాదేవి అన్నారు. నామినేషన్ వేసిన ఆమె భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో రాంమాధవ్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ముధోల్ నియోజకవర్గంలో విఠల్‌రెడ్డి ఎక్కడ అభివృద్ది చేశారన్నారు. భైంసాలో వంద పడకల వరకు ఆసుపత్రి ఉన్నా ఏ ఒక్క సమస్య కూడాపరిష్కరించలేకపోయావన్నారు. ఏరియా ఆసుపత్రిలో అన్ని అసౌకర్యాలే ఉన్నాయన్నారు. గ్రామాల్లో టీ ఆర్ ఎస్ నాయకులు ప్రచారానికి వెళ్తే.. ప్రజల వద్ద నుండి నిరసన సెగ తగులుతుందన్నారు. ఇటీవల హంగిర్గ గ్రామానికి వెళ్లిన విఠల్‌రెడ్డి బీజేపీ కార్యకర్తలను చూసి భయపడ్డారని తెలిపారు.
బీజేపీలో పలువురి చేరిక.
బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్ సమక్షంలో నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్, టీ ఆర్ ఎస్, టీడీపీ పార్టీల నుండి బీజేపీపార్టీలో చేరారు. వీరికి ఆయన బీజేపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బహిరంగ సభలో ఆయనకు గజమాలతో సన్మానించారు. పలువురు కార్యకర్తలు సెల్పీలు దిగారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బాలాజీ సూత్రవే, గాలి రవికుమార్, నిజాం వేణుగోపాల్, ప్రతాప్‌రావు, సాయినాథ్, అనీల్‌కుమార్‌తో పార్టీ కార్యకర్తలు, నాయకులు , అభిమానులు పాల్గొన్నారు.