రాష్ట్రీయం

జపాన్ డిజైన్‌కే జై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 25: రాజధాని నిర్మాణానికి జపాన్ ఆర్కిటెక్చర్లు రూపొందించిన డిజైన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఆమోదించారు. దీంతో రాజధాని అమరావతి నిర్మాణానికి చేపట్టిన చర్యలు తుది దశకు చేరుకున్నాయి. మూడు దేశాలకు చెందిన ఆర్కిటెక్ట్‌లు రూపొందించిన నమూనాలను ఆరుగురు సభ్యులతో కూడిన బృందం కూలంకషంగా పరిశీలించి టోక్యోకు చెందిన మాకి అసోసియేట్స్ రూపొందించిన డిజైన్ అన్ని విధాలా అనుకూలమని ఎంపిక చేసింది. దానే్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారు. స్థానిక ప్రైవేట్ సమావేశ మందిరంలో శుక్రవారం రాజధాని నిర్మాణంపై మూడు కంపెనీలు ప్రతిపాదించిన నమూనాలపై జ్యూరీ సభ్యులు కిష్టోపర్ బెంజిర్ - ఇండియా, కెటి రవీంద్రన్ - ఇండియా, ఎరివిన్ వీరే - జపాన్, సూహా వోకాన్ - టర్కీ, కేసవ్ వర్మ, రాజీవ్‌సేది తదితరులతో పరిశీలన చేసి రాజధాని నిర్మాణానికి ఎంపిక చేసిన కంపెనీని ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాణి రుద్రమదేవి పట్ట్భాషేకం జరిగిన 1261వ సంవత్సరం మార్చి 25వ తేదీనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి చెందిన నమూనాను ఆమోదించుకోవడం యాధృచ్ఛికమని, శుభ సూచకమని అభివర్ణించారు. మూడు నమూనాలు అద్భుతంగా ఉన్నాయని, రాజధాని నిర్మాణంలో ‘గ్రీన్ అండ్ బ్లూస్’ కలయికతో అద్భుతమైన నమూనాను సదరు కంపెనీలు ప్రతిపాదించాయన్నారు. మూడు కంపెనీలు చేసిన ప్రతిపాదనలు స్వాగతిస్తున్నామని వాటిలో ఉత్తమమైన ప్రతిపాదనలను భవిష్యత్‌లో చేసే నిర్మాణాల్లో భాగస్వామ్యం చేసేలాగా అధ్యయనం చేయడం జరుగుతుందన్నారు.
ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో ప్రపంచంలోని ప్రముఖమైన ఆర్కెటెక్ కంపెనీలను పిలవడం జరిగిందని వాటిలో మాకి అండ్ అసోసియేట్స్ జపాన్, వాస్తు శిల్పి కన్సల్‌టెంట్స్ ఇండియా మరియు రోజర్స్ స్ట్రిక్సుహ్రౌజర్ + పార్టనర్స్ యుకెలను ఎంపిక చేసి వారి ద్వారా ఉత్తమమైన ప్రతిపాదనలను కోరడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో అనుకున్న విధానపరమైన అంశాలకు సరిపడే ప్రతిపాదనలను నమూనాలను అందించిన మాకీ అండ్ అసోసియేట్స్ జపాన్ సంస్థను ఎంపిక చేశామన్నారు. రాజధాని ప్రాంతంలో రెండు ఐకానిక్ భవనాలను నిర్మిస్తున్నామని వీటితోపాటు కూచిపూడి సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా వంతెన నిర్మాణాన్ని నిర్మించబోతున్నామని వెల్లడించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలు నమూనాలు అద్భుతమైన రీతిలో ఉన్నాయని తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులు రాబోయే మూడు నెలల్లో పూర్తయిన వెంటనే శాశ్వత రాజధాని పనులను ప్రస్తుతం ఆమోదించిన ఆర్క్‌టెక్ విధానంలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజధాని నిర్మాణం కోసం వచ్చిన మూడు ప్రతిపాదనలూ అద్భుతంగా ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న నిర్మాణాలపై జ్యూరీ సభ్యులను, కమిటీని అభినందించారు. మరో కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ ఆర్ధిక చేకూర్పు కలిగించేలాగ భవిష్యత్ ప్రణాళికలతో ప్రతిపాదించిన అమరావతి రాజధాని నిర్మాణం పట్ల అందుకు చేసిన ప్రతిపాదనలను ప్రస్తుతించారు. ఈ సమావేశంలో జ్యూరీ సభ్యులు కూడా మాట్లాడారు.

చిత్రం ఎంపిక చేసిన డిజైన్‌ను మంత్రులతో కలిసి పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు