రాష్ట్రీయం

కాంగ్రెస్‌కు శంకర్‌రావు గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: సుమారు నలభై ఏళ్ళ పాటు కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు, సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి డాక్టర్ పి. శంకర్‌రావుకు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ దక్కలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన డాక్టర్ శంకర్ రావు ఆదివారం సమాజ్‌వాది పార్టీలోకి
ఫిరాయించారు. సమాజ్‌వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.ఎస్. సింహాద్రి ఆయనకు సాదరంగా స్వాగతం పలికి, పార్టీ కండువాను కప్పారు. డాక్టర్ శంకర్ రావు తన కుమార్తె సుస్మితను, కొంత మంది కార్యకర్తలను వెంట తీసుకుని వెళ్ళి ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సింహాద్రి ఆయనకు షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ‘బీ-్ఫం’ అందజేశారు. అనంతరం డాక్టర్ శంకర్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ టిక్కెట్ దక్కక పోవడం పట్ల బాధను వ్యక్తం చేశారు. టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తనపై అక్కసుతోనే టిక్కెట్ రాకుండా చేశారని ఆయన విమర్శించారు. షాద్‌నగర్ నుంచి విజయం సాధించి చూపిస్తానని అన్నారు. తాను విజయం సాధించగానే తనకు టిక్కెట్ రాకుండా చేసిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధ్యక్ష పదవి నుంచే కాకుండా రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డాక్టర్ శంకర్ రావు పార్టీకి చేసిన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు.