రాష్ట్రీయం

మరో ముగ్గురు జంప్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: వైకాపా నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరనున్నారా? ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు దఫదఫాలుగా వైకాపాకు గుడ్‌బై చెప్పి టిడిపిలో చేరారు. తాజాగా వైకాపా శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ వైకాపాను వీడతారనే ప్రచారం ఊపందుకుంది. ఆయనతోపాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. శాసనసభలో వైకాపాకు 67 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. జ్యోతుల నెహ్రూతోపాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడడం నిజమైతే వైకాపా బలం 56కు పడిపోతుంది. ఉగాది పండగ కంటే ముందుగా వీరు టిడిపి తీర్ధం పుచ్చుకుంటారని సమాచారం. జ్యోతుల నెహ్రూ వాస్తవానికి టిడిపి ఆవిర్భావం నుంచి ఉన్నారు. కాగా తూర్పుగోదావరి జిల్లాలో మారిన రాజకీయ సమీకరణల దృష్ట్యా వైకాపాలో గత ఎన్నికల ముందు చేరారు. శనివారం అసెంబ్లీకి కూడా నెహ్రూ రాలేదు. పిఏసి చైర్మన్‌పైన జ్యోతుల నెహ్రూ ఆశలు పెట్టుకున్నారని, కాని ఆ పదవి తనకు దక్కకపోవడంతో అలిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, రాజేశ్వరి కూడా టిడిపిలో చేరతారనే పుకార్లు జోరందుకున్నాయి. నెహ్రూ టిడిపిలోచేరుతారనే సమాచారంతో వైకాపా అధినేత జగన్ అప్రమత్తమై పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉగాది పండగ ముందు వీరు పసుపుకండువా వేసుకుంటారని తెలిసింది. జ్యోతుల నెహ్రూను మొబైల్ ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
స్పీకర్‌కు లేఖ రాసిన జగన్
ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా ఓటింగ్ నిర్వహించాలని, డివిజన్ ఓటింగ్ ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను కోరుతూ ప్రతిపక్ష నేత జగన్ స్పీకర్‌కు లేఖ రాశారు. అలాగే తమ పార్టీ ఎమ్మెల్యేలు 67 మంది ఉన్నారని, వీరి జాబితాను కూడా స్పీకర్‌కు పంపిస్తూ లేఖ రాశారు.