రాష్ట్రీయం

ప్రేమించలేదని గొంతు కోశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాంపల్లి, మార్చి 26: తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో యువతి గొంతు, చేయికోసి యువకుడు పరారయ్యాడు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం బండ్లగూడెంలో శనివారం ఈ ఘోరం జరిగింది. బండ్లగూడెం గ్రామానికి చెందిన గార్లపాటి శేఖర్‌రెడ్డి కుమార్తె అనిత, వరంగల్‌కు చెందిన పంగ రాజ్‌కుమార్ గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ తపస్య జూనియర్ కళాశాలలో లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. అనితను ప్రేమిస్తున్నానని, తననే పెండ్లి చేసుకోవాలంటూ గత కొంతకాలంగా రాజ్‌కుమార్ ఆమె వెంటపడుతున్నాడు. అయితే రాజ్‌కుమార్ ప్రేమను ఆమె నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆమెపై రాజ్‌కుమార్ పగ పెంచుకున్నాడు. శనివారం తన స్వగ్రామం బండ్లగూడెంలోని తన ఇంటికి అనిత వచ్చింది. రాజ్‌కుమార్ ఆమె ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనితతో తనను ప్రేమించాలని బలవంతపెట్టాడు. దీంతో ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో కోపంతో రాజ్‌కుమార్ కత్తితో అనిత గొంతు, చేతులను కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు విని బంధువులు, ఇరుగుపొరుగు వారు చేరుకోగా రాజ్‌కుమార్ పరారయ్యాడు. తీవ్ర గాయలతో రక్తమడుగులో పడివున్న అనితను నల్లగొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతుంది. బాధితురాలి తల్లిదండ్రులు, పెదనాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడు కోసం గాలింపు చేపట్టామని ఎస్‌ఐ నారాయణరెడ్డి తెలిపారు.

chitram నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అనిత