ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారి ఆభరణాల పరిశీలన ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 22: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆభరణాలను గురువారం ప్రత్యేక అధికారుల బృందం పరిశీలించారు. 15 రోజులపాటు ఈ పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి రాములవారి మేడ సమీపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏడాది శ్రీవారి ఆలయంలో ఆభరణాలను పరిశీలించే కార్యక్రమం ఆనవాయితీగా సాగుతోంది. ఇందుకు సంబంధించి తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ శ్రీవారి ఆభరణాల పరిశీలనా కార్యక్రమం ప్రత్యేక అధికారుల బృందంతోపాటు జ్యువలరీ టెక్నికల్ అప్రైజర్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. శ్రీవారి ఆలయంలో విష్వక్సేనులు ఉన్న వలయాకార ప్రాంతంలో 10 నుంచి 15 రోజులపాటు ఈ పరిశీలన కొనసాగుతుందన్నారు. ఇందులో భాగంగా స్వామివారికి అలంకరించే ఆభరణాలను ఈ అధికారుల బృందం పరిశీలిస్తారన్నారు. ఈ ఆభరణాల్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నా వాటిని ఒక నివేదిక రూపంలో ఈ అధికారల బృందం టీటీడీ ఈఓ ద్వారా బోర్డుకు అందజేస్తామన్నారు.

చిత్రం..తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీవారి ఆభరణాలను పరిశీలిస్తున్న కమిటీ సభ్యులు