రాష్ట్రీయం

తొలగింపు తేలిక కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్ధుల సంఘర్షణ నేపథ్యంలో వైస్ ఛాన్సలర్‌ను రీ కాల్ చేయాల్సిందిగా కోరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శాసనసభలో చెప్పడంతో మరోమారు విసిల తొలగింపు అంశం తెరమీదకు వచ్చింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జాతీయ స్థాయి సంస్థల వైస్ చాన్సలర్ల తొలగింపు ఆషామాషీ వ్యవహారం కాదు, విసిలను తొలగించేందుకు ప్రధానికి సైతం నేరుగా అధికారాలు లేవు, రాష్టప్రతి జోక్యంతోనే తొలగించాల్సి ఉంటుంది. ఆ మాటకు వస్తే రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను సిఎంలు సైతం తొలగించడం ప్రస్తుత చట్ట నిబంధనల ప్రకారం సాధ్యం కాదు, నచ్చచెప్పి విసిలతో రాజీనామాలు చేయించుకోవడం మినహా నేరుగా విసిలను తొలగించే అధికారం ఆయా రాష్ట్రాలకూ లేదు.
జాతీయ సంస్థల విసిల తొలగింపునకు కఠిన నియమావళి అనుసరించాల్సి ఉంటుంది. సెంట్రల్ యూనివర్శిటీల వైస్ చాన్సలర్లను తొలగించే అధికారం రాష్టప్రతికి మాత్రమే ఉంటుంది. 1974 యాక్ట్ 39 ప్రకారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటైంది. ఆ చట్టం ప్రకారం యూనివర్శిటీకి విజిటర్‌గా రాష్టప్రతి వ్యవహరిస్తున్నారు. రాష్టప్రతి నియమించిన వారు ఛాన్సలర్‌గా ఉంటారు, ఛాన్సలర్ రాష్టప్రతితో మాట్లాడిన తర్వాత కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ సూచన మేరకు వైస్ చాన్సలర్ నియామకం జరుగుతుంది. కేంద్రీయ యూనివర్శిటీల్లో విసిల పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది.
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్‌ను తొలగించాలంటే అందుకు యూనివర్శిటీలో ఉన్న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛాన్సలర్‌కు ఫిర్యాదు చేయాలి. విజిటర్‌గా ఉన్న రాష్టప్రతి దృష్టికి ఛాన్సలర్ ఆ ఫిర్యాదు అంశాన్ని తీసుకువస్తారు.మరో పక్క కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ స్పందించి కమిటీని వేయాలి. ప్రాధమిక కమిటీ చేసిన నిర్ధారణలపై ఉన్నతస్థాయి కమిటీని లేదా న్యాయవిచారణ జరపాల్సి ఉంటుంది. ఆ కమిటీ సైతం విసి చర్యలను తప్పుపట్టినపుడు వెంటనే విసిని సస్పెండ్ చేసి ఆ విషయాన్ని రాష్టప్రతి దృష్టికి తీసుకురావాలి. రాష్టప్రతి ఆ నివేదికపై ఉన్న న్యాయబద్ధతను ప్రశ్నించిన తర్వాత వీలైతే న్యాయశాఖ, ఎజిల సిఫార్సులు తీసుకున్న తర్వాత తదుపరి చర్యకు ఉపక్రమించాల్సి ఉంటుంది, ఇవన్నీ చేసే ముందు విసి వివరణను రాష్టప్రతి తీసుకోవల్సి ఉంటుంది. ఈ తతంగాన్ని కాదని ప్రధాని నేరుగా వైస్ ఛాన్సలర్‌ను తొలగించే అధికారం ప్రస్తుత చట్టం ప్రకారం లేనే లేదని నిపుణులు చెబుతున్నారు.అసమర్ధత, క్రమశిక్షణా లేమి పేరుతో విసిని తొలగించే సర్వాధికారాలు రాష్టప్రతికి మాత్రమే ఉన్నాయని విద్యానిపుణులు , ప్రస్తుత సెంట్రల్ యూనివర్శిటీ చట్టం వివరిస్తోందని వారు చెబుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయం విసి ప్రొఫెసర్ డిసి రెడ్డి(1999-2002)ని తొలగించాలని టిడిపి ప్రభుత్వం చేసిన విశ్వప్రయత్నాలు ఫలించలేదు. అలాగే ఆంధ్రాయూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ వై సి సింహాద్రి (2002-2005) తొలగించేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ ప్రభుత్వం వినియోగించుకున్నా చివరికి ఆయన రాజీనామా చేయడం మినహా ఏమీ చేయలేకపోయింది. అదే విధంగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పి కుసుమకుమారిని తొలగించాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టడంతో చివరికి ఆమె చేతనే రాజీమానా చేయించి ప్రభుత్వం మమ అనిపించింది. ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కడప రమణయ్య (2007-2011)పై ఎన్నో ఆరోపణలు వచ్చినా, ఆ ఆరోపణలపై నియమితులైన కమిటీ ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. చివరికి ఆయన రిటైర్మెంట్ వయస్సుదగ్గర పడటంతో ఎలాంటి వివాదాలు లేకుండానే పదవీ విరమణ చేశారు.
అయితే కేంద్రప్రభుత్వం మాత్రం పిహెచ్‌డిని కాపీకొట్టారనే ఆరోపణలతో పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్శిటీ విసిని బహిష్కరించింది. అలాగే విశ్వభారతి యూనివర్శిటీ విసి శుశాంత్ దత్త గుప్త తొలగింపునకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. రెండు మూడుసార్లు రాష్టప్రతి దానిపై వివరణ అడగాల్సి వచ్చింది.

బి.వి. ప్రసాద్