రాష్ట్రీయం

ఏపిలోనూ ఎమ్మెల్యేల వేతనం పెంపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: తెలంగాణలో మాదిరి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాలు త్వరలో పెరగనున్నాయి. ఆ ప్రకారం మంత్రులు, విప్‌లు, ఇతర పదవుల్లో ఉన్న వారి వేతనాలు కూడా భారీగా పెరగనున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం కనీసం రెండు లక్షలకు పెంచాలని ఎమినిటీస్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు అసెంబ్లీ హాలులో సమావేశమైన ఎమినిటీస్ కమిటీ సిఫార్సులు చేసింది. ఎమ్మెల్సీలకు నెలకు 90వేల వేతనాన్ని రెండు లక్షలకు పెంచాలని, కమిటీ పేర్కొంది. ఇందులో 1.5 లక్షలు వేతనం కాగా, 50వేలను అలవెన్స్‌గా ఇస్తారు. ఇక వాహన రుణాన్ని కూడా 15 లక్షల నుండి 40 లక్షలకు పెంచాలని సిఫార్సు చేసింది. కమిటీ సిఫార్సులను శాసనసభ ఆమోదించిన నాటి నుండి కొత్త వేతనాలు అందుబాటులోకి వస్తాయి.