రాష్ట్రీయం

కొడంగల్ ఆత్మగౌరవాన్ని కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోస్గి, డిసెంబర్ 5: వలసల జిల్లాగా పేరుపొంది అభివృద్ధిలో వెనకబడ్డ పాలమూరు జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం పరిస్థితిపై కపటప్రేమ చూపిస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఈ నాలుగున్నర ఏళ్ళల్లో కనపడలేదా? కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి అని కాంగ్రెస్ అభ్యర్థి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కోస్గిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పూర్తిగా వెనక్కినెట్టారని, ప్రశ్నించే ధైర్యం స్థానిక నాయకుల్లో కొరవడినందుకే కుల, మత రాజకీయాలను తెరపైకి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. గడిచిన ఈ నాలుగున్నర సంవత్సరాల్లో బంగారు తెలంగాణ సాధిస్తామన్న టీఆర్‌ఎస్ నాయకులకు నియోజకవర్గ సమస్యలు కనబడలేదా? అని ఆయన ప్రశ్నించారు. పబ్బం గడుపుకొనేందుకుకే కేసీఆర్ గత చరిత్ర గురించి మాట్లాడుతున్నారని, దమ్ముంటే అధికార దాహం వదిలి నాతో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి దోచుకు తింటున్నారని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికార దాహంతో ఎన్నిరాజకీయ కుట్రలు చేసినా కొడంగల్ ప్రజలు మాత్రం తమ తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

చిత్రం..కోస్గి రోడ్‌షోలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి