రాష్ట్రీయం

ఇబ్బందుల నుంచి ఆదుకోండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి: జిల్లాలో కరువు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమను ఆదుకోవాలని కడప జిల్లా రైతులు కేంద్ర కరువు బృందం సభ్యులతో మొరపెట్టుకున్నారు. గురువారం కడప జిల్లా రాయచోటి, రామాపురం మండలాల్లో కేంద్ర కరువుబృందం సభ్యులు రాజీవ్‌సింగాల్, కరణ్‌చౌదరి, సందీప్‌శర్మ పర్యటించారు. రామాపురం మండలంలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. ప్రతి యేటా రైతులు కరువుతో చాలా నష్టపోతున్నారని, అయినా ప్రభుత్వం ఆదుకోవడం లేదన్నారు. నల్లగుట్టపల్లెలో హార్టికల్చర్ కింద సాగు చేసిన ఎండిపోయిన టమోటా, చిక్కుడు, వంకాయ పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. డ్వామా కింద చేపలచెరువులో జరుగుతున్న ఫిష్‌పాండ్ పనులను పరిశీలించింది. రాచపల్లె, సుద్దమళ్ల గ్రామాల్లో ఎండిపోయిన ఉలవ, జొన్న, అలసంద పంట పొలాలను సభ్యులు పరిశీలించారు. ఎండిపోయిన మామిడిచెట్లకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తూ కాపాడుకుంటూ వస్తున్నామని సుద్దమళ్ల గ్రామానికి చెందిన రైతు పుల్లారెడ్డి కేంద్ర బృందానికి వివరించారు. ఒక్కో ట్యాంకర్‌కు ఎంత చెల్లిస్తున్నారు, ప్రభుత్వం రాయితీ ఎంత ఇస్తోంది, మీరు ఎంత భరిస్తున్నారని అని కేంద్ర బృందం సభ్యులు రైతును అడిగి తెలుసుకున్నారు. రైతు 20 శాతం భరిస్తే ప్రభుత్వం 20 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఉద్యానశాఖాధికారులు కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు కరవు సమస్యలను బృందం సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉపాధి పనిదినాలు పెంచాలని విన్నవించారు. రాయచోటి మండలం శిబ్యాల పెద్దచెరువును పరిశీలించి రైతులతో బృందం సభ్యులు మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర కరువు బృందం సభ్యుడు రాజీవ్‌సింగాల్ మాట్లాడుతూ రాయచోటి, రామాపురం మండలాల్లో కరువు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయన్నారు. ఉపాధి పనిదినాలు పెంచే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తామన్నారు. క్షేత్ర స్థాయిలో ఎండిపోయిన పంట పొలాలు, బోరుబావులు, నీటి కుంటలను, ఉపాధి హామీ పనులను పరిశీలించామని వీటన్నిటిపై సమగ్ర నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి సమర్పించి వీలైనంత త్వరగా ఆర్థికసాయం అందేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

చిత్రం..కడప జిల్లా రామాపురంలో నల్లగుట్టపల్లెలో ఎండిన టమోటా పంటను పరిశీలిస్తున్న బృందం సభ్యులు