రాష్ట్రీయం

మార్పులను అందిపుచ్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 6: కాలంతో పరిగెత్తాలని, కాలంతో వచ్చే మార్పులను అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వెలగపూడి సచివాలయంలో కియా మోటార్స్‌కు చెందిన ఈ-కార్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. కియా కారులో కాసేపు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ ధరకే సౌర విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. ఒకప్పుడు సౌర విద్యుత్ ధర 14 రూపాయలు ఉండేదని, ఇప్పుడు నాలుగు రూపాయలకే లభిస్తోందన్నారు. దీనిని రూపాయిన్నరకే ఇచ్చే రోజులు త్వరలోనే రానున్నాయన్నారు. ఇంధన పొదుపు పరికరాల తయారీలో ముందుంటే ఇక మనకు తిరుగు ఉండదన్నారు. కాలుష్యమే ప్రధాన సమస్య అని, దీనిని నియంత్రించడం మనందరి బాధ్యతన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, సంప్రదాయేత ఇంధన వనరుల అభివృద్ధి జరుగుతోందన్నారు. కియా రాకతో రాష్ట్రంలో అత్యంత వేగంగా కార్ల తయారీ పరిశ్రమ విస్తరిస్తోందన్నారు. ఆటోమొబైల్ కంపెనీల రాకతో 16 అనుంబంధ పరిశ్రమలు వచ్చాయన్నారు. 4700 కోట్ల రూపాయల పెట్టుబడితో 6600 మందికి ఉపాధి కల్పించనున్నాయన్నారు. ఏపీ ఆటోమొబైల్ హబ్‌గా మారుతోందన్నారు. ఎంప్లాయిబిలిటీలో ఏపీ ఇప్పటికే దేశంలో నెంబర్ 1గా నిలిచిందన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు.
ఏపీకి బహుమతిగా కార్లు
అత్యంత ఆధునిక నిరో హైబ్రిడ్, నిరో ప్లగ్ ఇన్ హైబ్రిడ్, నిరో ఎలక్ట్రికల్ కార్లను రాష్ట్ర ప్రభుత్వానికి బహుమతిగా అందిస్తున్నట్లు కియా సీఈవో షిమ్ ప్రకటించారు. ప్రపంచ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా 16 వేరియంట్లలో కియా ఎలక్ట్రికల్ కార్లను తీసుకువస్తామని తెలిపారు. అనంతపురంలోని యూ నిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 11 వేల మందికి ఉపాధి లభించిందన్నారు. అంతకుముందు కొత్త కారులో సభాస్థలి వరకూ ముఖ్యమంత్రి ప్రయాణించారు. ఎలక్ట్రికల్ కారులో తన ప్రయాణం సాఫీగా, సౌకర్యవంతంగా సాగిందన్నారు. కారు లోపల ఉంటే ఏసీ గదిలో ఉన్నట్లుందన్నారు. ఒకసారి చార్జింగ్ చేసుకుంటే 455 కిలోమీటర్ల వరకూ ప్రయాణించే వీలు ఉంటుందని, 40 శాతం థర్మ ల్ ఎఫిషియన్సీతో కారును తెస్త్తున్నట్లు షిమ్ వివరించారు.
చిత్రం..కియా సంస్థ అందజేసిన విద్యుత్ కారు నడుపుతున్న సీఎం