రాష్ట్రీయం

ప్రపంచ శాంతి కోసం దువా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, డిసెంబర్ 10: ప్రపంచ శాంతి కోసమే దువా (ప్రార్థన) అని ఇస్తెమా కమిటీ చీఫ్ హజరత్ వౌలానా సాద్ సాబ్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని నన్నూర్ గ్రామం సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి ‘అలమీ తబ్లీక్ ఇస్తెమా’ సోమవారం ముగిసింది. ఇస్తెమాకు దేశ నలుమూలల నుంచే కాకుండా 15 దేశాల నుంచి దాదాపు 15 లక్షల మంది ముస్లింలు హాజరయ్యారు. ‘‘యా అల్లాహ్ ముజే మాప్‌కర్’’ (దేవుడా నన్ను క్షమించు) అనే మాటలతో దేశవిదేశాల నుంచి వచ్చిన మతపెద్దలు, వౌల్వీలతో ఇస్తెమా మైదానం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఇస్తెమా కమిటీ చీఫ్ హజరత్ వౌలానా సాద్ సాబ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ ఉత్తమ సమాజ నిర్మాణానికి విశ్వాసం, సత్యం, సఖ్యత వంటి మంచి సద్గుణాలు కలిగి ఉండటం ముఖ్యమని సూచించారు. దైనందిన జీవితంలో అల్లాహ్ పేరును ఏ రూపంలోనైనా పఠిస్తే తద్వారా ప్రతికార్యం, ప్రతిచర్య సవ్యంగా ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతుందన్నారు. మానవ జీవితం ఎంతో చిన్నదని, ఇంత చిన్న జీవితంలో మనిషి స్వార్థంతో తమ వారి కోసం హద్దుకు మించి సంపాదించేందుకు మోసాలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని వివరించారు. తమ వారి కోసం ఎన్ని కోట్ల రూపాయలు కూడబెట్టినా కలిగే ప్రయోజం ఏమీ లేదన్నారు. పరలోకాన్ని దృష్టిలో పెట్టికుని మనం ఇక్కడ చేసే దానధర్మాలు, పుణ్యకార్యాలే మనల్ని సన్మార్గానికి తీసుకెళ్తాయన్నారు. మనిషిని జాగ్రత్త పరిచేందుకు దైవమే అప్పుడప్పుడు చిన్నపాటి విపత్తులు సృష్టిస్తుంటారని, వాటిని చూసి మేల్కొని సన్మార్గంలో పయనించాలన్నారు. నేటి సమాజంలో ముస్లింలు కష్టాలు ఎదుర్కొంటున్నారంటే వారు సన్మార్గం, ప్రవక్త పద్ధతులను వీడి తమ మనస్సుకు నచ్చిన మార్గంలో వెళ్లడమే కారణమన్నారు. మంచిచేస్తే సృష్టిలోని ప్రతి ప్రాణికి మేలు చేకూరే విధంగా దువా చేస్తున్నామన్నారు. మార్గం తెలియని వారికి దారి చూపే మార్గదర్శకుడు ప్రవక్త అన్నారు. ప్రతి ఒక్కరికీ మహమ్మద్ ప్రవక్త మార్గమే అనుసరణీయం కావాలన్నారు. చెడుమార్గాన్ని వీడి కరుణ, దానగుణంతో పాటు సోదరభావం అలవర్చుకోవాలన్నారు. ప్రపంచ ముస్లింలకు ఈ ఇస్తెమా మంచి వైపు తీసుకెళ్లే దిక్సూచి కావాలని ప్రార్థించామన్నారు. ప్రతి ముస్లిం దైవానికి అంకితమై జీవించాలన్నారు. ఇస్తెమాతో సన్మార్గం సాధ్యమని, ముస్లింలు ఏ పని చేసినా అందులో దైవాజ్ఞ, ప్రవక్త పద్ధతులు ఉన్నాయో లేదో చూసుకోవాలన్నారు. ప్రపంచ శాంతి కోసం, నవ్యాంధ్రప్రదేశ్ శాంతియుతంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని అల్లాహ్‌ను ప్రార్థించామన్నారు.
ఇస్తెమాలో పాల్గొన్న హోంమంత్రి
కర్నూలు శివారులో నిర్వహించిన ఇస్తెమాలో హోంమంత్రి చినరాజప్ప సోమవారం పాల్గొన్నారు. ఇస్తెమా కమిటీ చీఫ్ హజరత్ వౌలానా సాద్ సాబ్‌ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఇస్తెమా నిర్వహించడం వల్ల ఈప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్నారు. అందుకే సీఎం నిధులు విడుదల చేశారన్నారు.
చిత్రం..కర్నూలు శివారులో నిర్వహించిన ఇస్తెమాలో చివరి రోజు ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు