రాష్ట్రీయం

మాఫియాపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: రాష్ట్రంలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపామని, అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నామని మంత్రి హరీశ్‌రావు శాసనసభకు వెల్లడించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ గతంలో లారీ ఇసుక రూ. 35 వేలుంటే, ఇప్పుడు రూ.11వేలు ఉందన్నారు. ఇసుక పాలసీ ద్వారా తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై రూ.11 కోట్ల పెనాల్టీలు విధించామన్నారు. మూడోసారి అక్రమ రవాణా చేసి దొరికిపోతే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నామన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఇసుక మాఫియాపై ఫిర్యాదుకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు.
జీవో 58 కింద 1.2 లక్షల
దరఖాస్తుల క్రమబద్ధీకరణ
రాష్ట్రంలో జీవో 58 కింద 1,20,094 దరఖాస్తులను క్రమబద్ధీకరించామని, లబ్ధిదారులకు పట్టా ధృవపత్రాలను జారీ చేశామని, దీనివల్ల ఖజానాకు రూ.261.29 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి మెహమూద్ అలీ చెప్పారు. ఎమ్మెల్యేలు కెపి వివేకానంద్ తదితరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ రంగారెడ్డి జిల్లాలో 1.50 లక్షల దరఖాస్తులకు 80 వేల దరఖాస్తులు, హైదరాబాద్‌లో 61 వేల దరఖాస్తులకు 40 వేల దరఖాస్తులు, ఖమ్మం జిల్లాలో 20 వేల దరఖాస్తులలకు వెయ్యి దరఖాస్తుల వివరాలను క్రమబద్ధీకరించామన్నారు. కోర్టుకేసులు, ఆక్రమణలున్న స్ధలాలను క్రమబద్ధీకరించలేనదన్నారు. పేదవారికోసం సిఎం కె చంద్రశేఖరరావు ఈ స్కీంను అమలు చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ వివాదం, కోర్టు కేసులు లేని 125 గజాలలోపు ప్రభుత్వ స్ధలాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకున్నవారికి మాత్రమే క్రమబద్ధీకరణ జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని వారిలో అర్హులైన వారికి నేరుగా డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇస్తుందన్నారు. బిజెపి శాసనసభాపక్ష నేత డాక్టర్ లక్ష్మణ్, సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ రమావత్ తదితరులు మాట్లాడుతూ హైదరాబాద్‌లో 1452కు పైగా మురికివాడలున్నాయని, ఇందులో నివసిస్తున్న వారికి ఇళ్లను క్రమబద్ధీకరించాలని కోరారు.