రాష్ట్రీయం

లెక్చరర్ల పోస్టులూ క్రమబద్ధీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు, ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. శాసనసభలో సోమవారం విద్యాశాఖ పద్దులపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు కడియం శ్రీహరి సమాధానమిస్తూ విద్యాసంస్థల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులను రోస్టర్‌ను అనుసరించి క్రమబద్ధీకరించే ప్రక్రియ వచ్చే విద్యా సంవత్సరానికి పూర్తి చేయనున్నట్టు చెప్పారు. అలాగే టీచర్ల నియామకానికి మే 1న టెట్ పరీక్ష నిర్వహించి, తర్వాత డిఎస్సీ నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాయన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేయడంతోపాటు ప్రక్షాళన చేయడానికి సభ్యుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడానికి ఈనెల 30న సభలో ‘స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ’ అనే అంశంపై చర్చకు పెట్టనున్నట్టు కడియం శ్రీహరి చెప్పారు. దేశంలో రాష్ట్రాలు, కేంద్రప్రాంత ప్రాంతాలు కలిసి 36ఉంటే అందులో అక్షర్యాసతలో తెలంగాణ రాష్ట్రం 32 స్థానంలో ఉందని, ఇప్పటికీ రాష్ట్రంలో అక్షరాస్యత 66 శాతం మాత్రమే ఉందని కడియం శ్రీహరి ఆందోళన వ్యక్త చేశారు. విద్యాశాఖ పద్దులకు సభ ఆమోదించి, ద్రవ్యవినిమయ బిల్లుకు మంగళవారం ఆమోదం పొందిన తర్వాత విద్యవ్యవస్థపై బుధవారం ప్రత్యేక చర్చ పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటని కాంగ్రెస్ పక్షం ఉప నాయకుడు టి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. విద్య వ్యవస్థ ప్రక్షాళనపై ఈ నెల 30న చర్చ జరపడానికి బిజినెస్ అడ్వయిజరీ కమిటిలో చేసిన నిర్ణయాన్ని కాంగ్రెస్ నుంచి హాజరైన ప్రతినిధులు అంగీకారం తెలిపాక తిరిగి అభ్యంతరం పెట్టడం ఏమిటని కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు రాష్ట్రంలో 60 లక్షల మంది ఉండగా, అందులో 28 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో, 32 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారని కడియం శ్రీహరి వివరించారు. ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాన్ని మొదలు పెట్టిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే నిధులు పొందడానికే కోకొల్లలుగా విద్యాసంస్థలు పుట్టుకొచ్చాయని కడియం అన్నారు. ఇలాంటి పరిస్థితులపై చర్చించి విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన చేర్పులు, మార్పులపై సభ్యులు సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలో నియామకాలు జరుగక 20 ఏళ్లు అవుతుందని, 2018నాటికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లంతా రిటైర్డు కాబోతున్నారన్నారు. అదే జరిగితే ఉస్మానియా యూనివర్సిటీ నాక్ గుర్తింపు కోల్పోతుందన్నారు. ఆ పరిస్థితి రాకుండా అంతకుముందుగానే నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ యోచిస్తుందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 79 జూనియర్, 59 డిగ్రీ, 14 పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేసినప్పటికీ వాటికి వౌలిక సదుపాయాలు కల్పించడంకానీ, సిబ్బందిని నియామకం కానీ జరుగలేదని ఉప ముఖ్యమంత్రి అన్నారు. తమ ప్రభుత్వం గత ప్రభుత్వాలలో జరిగిన తప్పిదాలన్నింటినీ సరిదిద్దే ప్రయత్నం చేస్తుందన్నారు. విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యే జూలై వరకు అన్ని విద్యాసంస్థల్లో వౌలిక సదుపాయాల కల్పిస్తామని, దీని కోసం బడ్జెట్‌లో రూ. 1500 కోట్లు కేటాయించినట్టు కడియం శ్రీహరి వివరించారు.