రాష్ట్రీయం

టెన్త్ ఇంగ్లీషు ప్రశ్నపత్రంలో మళ్లీ తప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం/రామచంద్రాపురం, మార్చి 28: విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను విద్యాశాఖ తప్పుల తడకగా ఇచ్చి వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడుతోందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం జరిగిన ఇంగ్లీష్ పేపర్-2లో 2, 4, 5 ప్రశ్నలు రీడింగ్ సి నుంచి రావాల్సి ఉండగా రీడింగ్ ఎ నుంచి ఇవ్వడంతో విద్యార్థులు సమాధానాలు రాయలేక ఇబ్బందులు పడ్డారు. సోమవారం జరిగిన పరీక్షలో మొదటి పేపరు సిలబస్‌కు చెందిన ప్రశ్నరావడంతో విద్యార్థులు కంగుతిన్నారు. దీంతో మూడు మార్కులను విద్యార్థులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. శనివారం జరిగిన మొదటి పేపర్‌లో 13, బిట్‌పేపర్‌లో 22వ బిట్ తప్పులు వచ్చాయని విద్యార్థులు ఆందోళన చెందగా, మరోసారి ఉపాధ్యాయులు పరిశీలిస్తే 16వ ప్రశ్నకు ఛాయిస్ ఇవ్వాల్సి ఉండగా, తొలగించడం ఇబ్బందికరంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 17వ ప్రశ్న కనుమరుగైందని, అయితే 16వ ప్రశ్నలో ఉండే ఛాయిస్ డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్ ఈ ప్రశ్న స్థానంలో వచ్చిందని, దీంతో ఒక మార్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. విద్యాశాఖలో జరిగిన తప్పుల కారణంగా మార్కులు కోల్పోయే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం దీనిపై పునఃసమీక్షించి విద్యార్థులకు ఆ మార్కులు కలిసే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
పేపరు-1లో ఇవ్వాల్సిన ప్రశ్నలు 2లో ప్రత్యక్షం
రాయవరం: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన ఇంగ్లీషు-2 పేపరులో కొన్ని పొరపాట్లు దొర్లాయి. సోమవారం జరిగిన ఇంగ్లీషు-2 పార్టు ‘ఎ’లో ఇచ్చిన 2,4,5 ప్రశ్నలు పేపరు-1లో అడగాల్సి ఉండగా పేపరు-2లో అడగడంతో విద్యార్థులకు తికమకపడ్డారు. విద్యార్థులు నష్టపోయిన మూడు ప్రశ్నలకు బోర్డు అధికారులు మార్కులు కలపాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ నెల 26న జరిగిన ఇంగ్లీషు-1 పేపరులో కూడా కొన్ని తప్పులు దొర్లిన విషయం విదితమే.