రాష్ట్రీయం

తెలంగాణ ఎమ్సెట్ దరఖాస్తు గడువు పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్సెట్ దరఖాస్తు గడువును పెంచుతూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. అదనపు ఫీజు లేకుండా ఈ నెల 30వ తేదీ వరకూ పొడిగించారు. గత నెల 28వ తేదీ నుండి మార్చి 28వరకూ ఎలాంటి జాప్యపు రుసుం లేకుండా దరఖాస్తులను అనుమతించారు. ఇంతవరకూ 32 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అందులో మెడికల్‌కు 10వేల దరఖాస్తులు, ఇంజనీరింగ్‌కు 21,055 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో మెడికల్‌కు ఆంధ్ర రాష్ట్రం నుండి 4వేలు, ఇంజనీరింగ్‌కు 14,753 దరఖాస్తులు వచ్చాయి. కాగా 500 రూపాయిల జరిమానాతో ఏప్రిల్ 3 వరకూ, వెయ్యి రూపాయిల జరిమానాతో ఏప్రిల్ 13 వరకూ, 5వేల రూపాయిల జరిమానాతో ఏప్రిల్ 22 వరకూ, 10వేల జరిమానాతో ఏప్రిల్ 29 వరకూ దరఖాస్తు చేసుకునే వీలుంది. హాల్‌టిక్కెట్లు ఏప్రిల్ 24 నుండి 30వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో ఉంచుతారు. పరీక్ష మే 2న జరుగుతుంది.
ఇంగ్లీషుకు మార్కులు
ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్ ఇంగ్లీషు పేపర్ 2లో పేపర్ 1 ప్రశ్నలు రావడంపై అధికారులు సరిచూసుకున్నారు. విద్యార్ధులకు ఆ మేరకు మార్కులు కలిపి అన్యాయం జరుగకుండా చూస్తామని ప్రకటించారు.