రాష్ట్రీయం

ప్రజాప్రతినిధులకు రూ.2.30 లక్షల వేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీత భత్యాలను నెలకు రెండు లక్షల 30 వేల రూపాయలకు పెంచేందుకు వీలుగా ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాన్ని సవరించేందుకు రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి టి హరీశ్‌రావు సోమవారం సభలో బిల్లు ప్రతిపాదించారు. ఈ సవరణ బిల్లుపై మంగళవారం అసెంబ్లీలో జరిగే చర్చ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతం, అలవెన్సుల పెంపుదలపై ప్రకటన చేస్తుంది.
ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు 1.25 లక్షల రూపాయలు జీతం లభిస్తున్నది. సవరణ బిల్లును సభ ఆమోదిస్తే ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జీతం నెలకు 2.30 లక్షలకు పెరుగుతుంది. జీతాలు, అలవెన్సుల పెరుగుదల వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.42.67 కోట్ల భారం పడనుంది. అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు, శాసనమండలిలో 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎమ్మెల్యేలకు జీతాలతో పాటు, నియోజకవర్గం అభివృద్ధి అలవెన్సు, హెచ్‌ఆర్‌ఏ, పర్సనల్ అసిస్టెంట్‌కు చెల్లించే జీతం విడిగా లభిస్తుంది. ఇలాఉండగా మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించిన బిల్లుపట్ల మెజారిటీ ఎమ్మెల్యేలు పెదవి విరిచారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సౌకర్యాల (ఎమినిటీస్) కమిటీ ఇటీవల జీతభత్యాలపై చర్చించి, 3.50 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలంటూ నిర్ణయించి ప్రభుత్వానికి నివేదించింది.
కాగా దేశంలో ఎక్కడాలేని విధంగా 3.50 లక్షల రూపాయలు చెల్లిస్తే విమర్శలకు గురవుతామని ప్రభుత్వం భావించింది. పైగా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలను 2 లక్షలకు పెంచాలని నిర్ణయించగా, తెలంగాణలో మూడున్నర లక్షలకు పెంచడం బాగుండదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 2.30 లక్షలకు పెంచాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం సోమవారం బిల్లును సభలో ప్రతిపాదించింది.