రాష్ట్రీయం

ఇక పట్టిసం దశ తిరిగినట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 28: నదుల అనుసంధానంలో దేశంలోనే ప్రప్రథమంగా నమోదవుతున్న పట్టిసం ఎత్తిపోతల పథకం ప్రాంతం రానున్న రోజుల్లో పర్యాటకాభివృద్ధి విషయంలోనూ కీలకంగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. సోమవారం పట్టిసం ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడనికి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలచేశారు. ఇక్కడ జరిగిన బహిరంగసభలోప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న భూమిని పర్యాటకంగా కీలకమైన స్థానంగా మార్చడానికి పలు సూచనలు చేశారు. ఈప్రాంతంలో 200 ఎకరాల భూమి ఉందని, ఆ ప్రాంతంలో అద్భుతమైన గార్డెన్స్ అభివృద్ధిచేయాలని కాంట్రాక్టు సంస్థ మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధి కృష్ణారెడ్డిని కోరారు. ఇందుకు అవసరమైన సహకారం అందిస్తామని, ఇక్కడ గార్డెన్స్ అభివృద్ధిచేసి, వాటిని నిర్వహించాల్సిన బాధ్యతను తీసుకోవాలని సూచించారు. అలాగే ఎవరైనా ముందుకొస్తే ఈప్రాంతంలో మంచి హోటల్‌ను కూడా నిర్మించడానికి అవకాశం ఉందన్నారు. ఈప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే క్రమంలో సమీపంలో ఉన్న పట్టిసాచల క్షేత్రాన్ని అభివృద్ధిచేయడానికి రూ.70 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఒకపక్క వనాలు, మరోపక్క ప్రాజెక్టు, ఇంకోపక్క ఆధ్యాత్మికత ఉట్టిపడే పట్టిసాచల క్షేత్రంతో పర్యాటకరంగం ఊపందుకుంటుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి సూచనలకు మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఆమోదం తెలిపింది. రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా పెద్దఎత్తున వనాల అభివృద్ది చేపడతామన్నారు. బృందావన్ గార్డెన్స్ కన్నా పెద్దస్థాయిలో ఈ వనాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఇక పోలవరం రెవిన్యూ పరిధిలోని కొత్తూరులోని చెర్వుకు పోలవరం కుడికాల్వ ద్వారా నీటిని అందించాలని సభలో పలువురు విజ్ఞప్తులు చేశారు. దీనికి ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ కొత్తూరు చెర్వుకు నీరు అందిస్తామని, ఇప్పటికే దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశామని చెప్పారు. రోజుల వ్యవధిలోనే చెర్వుకు నీరు వస్తుందని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. అలాగే పట్టిసం ప్రాంతంలో రోడ్లను విస్తరించి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

చిత్రం పట్టిసం సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు