ఆంధ్రప్రదేశ్‌

గుజరాతీల్లా ప్రవర్తిస్తున్న బీజేపీ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 27: రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంధ్రుల్లా కాకుండా గుజరాతీయుల్లా ప్రవర్తిస్తున్నారని, వారికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమో, పార్టీ ప్రయోజనాలు ముఖ్యమో చెప్పాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు. గుంటూరులోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పలు అంశాలపై బహిరంగ లేఖను గురువారం విడుదల చేశారు.
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి ఏ రాష్ట్రానికి చేయని ద్రోహం నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌కు చేశారన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని ప్రజల నుండి గ్రామ స్థాయి నేత నుండి ముఖ్యమంత్రి వరకు పోరాడుతుంటే మద్దతు తెలపకపోగా రాళ్లు వేసే ప్రయత్నం చేయడం కన్నతల్లిని అవమానించడమేనన్నారు. రాష్ట్రానికి మొత్తం ఇచ్చేశామని, ఇంకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదని బీజేపీ అధినాయకత్వం చేసిన ప్రకటనను సమర్థించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
విభజనతో అన్నివిధాలా నష్టపోయిన రాష్ట్రానికి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటన చేశారని, అయితే హోదా లేదు ప్యాకేజీ అని చెప్పి నమ్మించి మోసగించింది నిజం కాదా అని ప్రశ్నించారు. విభజన హామీలైన రైల్వే జోన్, కడప స్టీల్‌ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్ట్‌తో సహా ఏ ఒక్క హామీని కేంద్రం అమలు చేయకపోవడానికి రాష్ట్ర బీజేపీ నాయకుల నివేదికలు కారణం కాదా అంటూ నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రధానమంత్రి మోదీని కలిసి 12 అంశాలతో కూడిన లేఖను అందించి వెంటనే అమలుచేయాలని కోరారని, ఆరు నెలలు గడవకముందే రాష్ట్రానికి కేంద్రం అన్నీ ఇచ్చేసింది, ఇంకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదనడం సమ్మతమేనా అని ప్రశ్నించారు. పోలవరానికి రాష్ట్రం వెచ్చించిన నిధుల్లో ఇంకా రూ.3,500 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉందని, అలాగే డీపీఆర్-2 ఆమోదించాల్సి ఉందని, పక్క రాష్ట్రాలతో సమస్యలను తీర్చాల్సి ఉండగా వీటిని తీర్చాలని ఏ నాడైనా రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరారా అని లేఖ ద్వారా ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ పథకం కింద రాష్ట్రానికి 4 వేల కోట్లు ఇస్తామని చెప్పి 3 శాతం నిధులు కూడా ఇవ్వలేదన్నారు.
ఈఏపీల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని 30 వేల కోట్లు అడిగితే రూ.37 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్న మాట వాస్తవం కాదా అన్నారు. అవినీతి రహిత పాలన అంటూ గద్దెనెక్కిన బీజేపీ, అవినీతికి కేరాఫ్ అయిన జగన్‌తో అంటకాగడం రాష్ట్ర ప్రజలను వంచించడం కాదా అని జవహర్ ప్రశ్నించారు. రహదారుల నిర్మాణంలో భాగంగా భారత్‌మాల ప్రాజెక్టు కింద బీజేపీ పాలిత రాష్ట్రాలకు భారీగా నిధులు కేటాయించి, రాష్ట్రానికి అన్యాయం చేయడం బాధాకరమన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి కేంద్రాన్ని ప్రశ్నించరు, ప్రతిపక్ష పార్టీకి కేసులున్నాయి కాబట్టి కేంద్రంతో పోరాడలేదని, మాకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యమైనందున కేంద్రాన్ని ప్రశ్నిస్తాం, ఎదిరిస్తాం అని జవహర్ లేఖలో వ్యాఖ్యలు చేశారు.