రాష్ట్రీయం

ఎన్టీఆర్ యుగపురుషుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: ఎన్టీఆర్ యుగపురుషుడు అని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ సినిమా రంగం ద్వారా, రాజకీయ రంగం ద్వారా సమాజాన్ని ప్రభావితం చేశారని ఆయన తెలిపారు. అసెంబ్లీలో వివిధ అంశాలపై ఎన్టీఆర్ చేసిన ప్రసంగాల సంకలనాలను స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆదేశంతో అసెంబ్లీ సిబ్బంది పుస్తకాన్ని ముద్రించింది. మంగళవారం టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పుస్తకావిష్కరణ సభలో స్పీకర్ కోడెల, ముఖ్యమంత్రి చంద్రబాబు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తూ ఎన్టీఆర్ మాండలిక విధానాన్ని తెచ్చారని చెప్పారు. ఎన్టీఆర్ తన ప్రసంగాల ద్వారా ప్రజలను చైతన్యపరిచి, కార్యోన్ముఖులుగా చేశారని ఆయన తెలిపారు. తెలుగు వారికి తెలుగు దేశం పార్టీని కానుకగా ఇచ్చారని ఆయన చెప్పారు. ఎన్టీఆర్‌ను తెలుగు జాతి ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని అన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద రావు ప్రసంగిస్తూ ఎన్టీఆర్ ప్రసంగాలను పుస్తక రూపంలో తీసుకుని రావడం వల్ల భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందని అన్నారు. అసెంబ్లీలో గతంలో పుచ్చలపల్లి సుందరయ్య వంటి హేమాహేమీలు విలువైన ప్రసంగాలు చేసే వారని ఆయన తెలిపారు.