రాష్ట్రీయం

అమరావతిలో భారీ అంబేద్కర్ విగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29 : నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 15,125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్ 14 నుండి ఏడాదిపాటు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అసెంబ్లీలో మంగళవారం వెల్లడించారు. అమరావతిలో 15 ఎకరాల్లో అంబేద్కర్ విగ్రహంతోపాటు స్మృతివనాన్ని నెలకొల్పుతామని, కనె్వన్షన్ సెంటర్, బుద్ధిస్ట్ ధ్యానకేంద్రం, గ్రంధాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. జయంతి ఉత్సవాల నిర్వహణకోసం రాష్టస్థ్రాయిలో తన అధ్యక్షతన ఒక కమిటీ, జిల్లాస్థాయిలో ఇంచార్జి మంత్రి నేతృత్వంలో జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమిటీలు అంబేద్కర్ ఐడియాలజీ రన్, స్పోర్ట్స్‌మీట్, అంబేద్కర్ రచనను తెలుగులోకి అనువాదం, టీవి ఛానళ్లలో డాక్యుమెంటరీల ప్రసారాలు చేయడంలో శ్రద్ధ చూపిస్తాయన్నారు.గత ప్రభుత్వ హయాంలో ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధి, సంక్షేమం కోసం కేటాయించిన నిధులను పూర్తిగా ఉపయోగించలేదని చంద్రబాబు విమర్శించారు. ఇందుకు భిన్నంగా తమ ప్రభుత్వం భారీయెత్తున ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమకోసం నిధులు వినియోగిస్తోందని, ఉపప్రణాళికలను చిత్తశుద్ధితో అమలు చేస్తోందన్నారు. మూడేళ్లలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలను దశలవారీగా గురుకుల పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. వివిధ యాజమాన్యాల కింద ఉన్న గిరిజన విద్యాసంస్థలను ఒకే గొడుగు కిందకు తెస్తామన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కుటుంబాల ఆదాయం నెలకు కనీసం 10 వేల రూపాయల వరకు ఉండేలా ఆర్థిక ప్రణాళిలను రూపొందించి అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అన్ని దళిత, గిరిజన వాడల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. 2018 వరకు సిమెంట్ రోడ్లను వేస్తామని ఆయన తెలిపారు. 2016 ఏప్రిల్ 16 న ఆరు లక్షల మందికి గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని సిఎం ప్రకటించారు.