రాష్ట్రీయం

ఆన్‌లైన్‌లో ఏటికొప్పాక బొమ్మలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 29: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశాఖ జిల్లా ఏటికొప్పాక బొమ్మలు ఇక ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. వందల సంవత్సరాలుగా హస్తకళా నైపుణ్యంతో రూపుదిద్దుకుంటున్న ఏటికొప్పాక బొమ్మలకు ఎంతో గిరాకీ ఉంది. వీటి విక్రయాలను అంతర్జాతీయ మార్కెట్‌కి విస్తరించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఎ) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏటికొప్పాక బొమ్మల విక్రయ బాధ్యతను అంతర్జాతీయ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు అప్పగించింది. ఈ మేరకు మహిళా సంఘాల జిల్లా సమాఖ్య, ఫ్లిప్‌కార్ట్ మధ్య అంగీకారం కుదిరింది. ఏటికొప్పాక గ్రామంలో దాదాపు 500 కుటుంబాలు బొమ్మల తయారీ ఆధారంగా జీవిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ బొమ్మలు విశాఖ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని నగరాలకే పరిమితం. డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో ఏటికొప్పాక బొమ్మల విక్రయం ద్వారా రూ.50 లక్షల వ్యాపారం జరుగుతోంది. ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం ద్వారా ఏటా రూ.5 కోట్ల వ్యాపారం లక్ష్యంగా పెట్టుకున్నట్టు డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ పి.సత్యసాయి శ్రీనివాస్ ఆంధ్రభూమికి తెలిపారు. ప్రస్తుతం 38 రకాల బొమ్మలను ఫ్లిప్‌కార్ట్ ద్వారా మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు. ఏటికొప్పాక బొమ్మలతో పాటు అరకులో లభించే రాట్‌ఐరన్ బొమ్మలు, విజయనగరం జిల్లా బొబ్బిలి వీణలను సైతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నామన్నారు.