ఆంధ్రప్రదేశ్‌

డివిజన్ ఓటింగ్ నుంచి పారిపోయిన ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేకనే తాము ద్రవ్య వినిమయ బిల్లుపై కోరిన డివిజన్‌ను వ్యతరేకించి మూజువాణి ఓటుతో ఆమోదించి అసెంబ్లీని వాయిదా వేశారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. డివిజన్‌కు అంగీకరిస్తే పార్టీ మారిన వైకాపా ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే పరువుపోతుందనే భయంతో చంద్రబాబు ఉన్నారని ఆయన ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన తర్వాత జగన్ విలేఖర్లతో మాట్లాడుతూ టిడిపి నేతలు అవినీతి సొమ్ముతో వైకాపా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్నారు.
డివిజన్‌కు అంగీకరించి ఉంటే పార్టీ ఫిరాయించిన వైకాపా ఎమ్మెల్యేల పదవులు పోయి ఉండేవన్నారు. ప్రభుత్వం డివిజన్‌ను అంగీకరించలేకపోయినా, వైకాపాదే నైతిక విజయమని ఆయన అన్నారు. రాష్ట్రప్రభుత్వం 22వేల కోట్ల పబ్లిక్ డిపాజిట్లను సేకరించిందని, ద్రవ్య బాధ్యత, యాజమాన్య నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బిఎం) ప్రకారం 3 శాతం జిఎస్‌డిపి దాటి డిపాజిట్లు తీసుకునే అవకాశం లేదన్నారు. కేంద్రం, ఆర్‌బిఐ అంగీకరించకపోయినా చట్టాలు ఒప్పుకోకపోయినా పబ్లిక్ డిపాజిట్లను వాడుకున్నారన్నారు.
రుణమాఫీ, పెన్షన్లు, హౌసింగ్, ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ అన్ని పద్దుల్లో కేటాయింపులు, ఖర్చులకు మధ్య వ్యత్యాసం ఉందన్నారు. అందుకే తాము ద్రవ్య వినిమయ బిల్లును వ్యతిరేకించామన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై మూజువాణి ఓటును నిర్వహించడం అనైతికమన్నారు. వైకాపా ఎమ్మెల్యే జి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ ఓటింగ్ నిర్వహించకుండా ప్రభుత్వం పారిపోయిందన్నారు. ఆంధ్రలో రాక్షసపాలన కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోలేదన్నారు. శాసనసభాపక్ష ఉపనేత విశే్వశ్వరరెడ్డి మాట్లాడుతూ ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందన్నారు.