రాష్ట్రీయం

అండాదండాలుండాలని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 10: జననం నుంచి మహాప్రస్థానం వరకు ప్రతి వ్యక్తి జీవన పరిణామాల్లో సంతోషకరమైన, ఆనందకరమైన మలుపులు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ జీవన కాల చక్రంలో వీలైనంత ఎక్కువగా ఈ రాష్ట్రంలో నివసించే కుటుంబాలు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పొందాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఈ దిశగా వివిధ దశల్లో వ్యక్తి కుటుంబ అభివృద్ధిలో అందరికీ ప్రభుత్వం అండగా ఉండాలన్న ఆకాంక్ష ఈ నాలుగున్నరేళ్లలో చాలావరకు నెరవేరింది. పేదలు, మధ్య తరగతి వారికి లబ్ధి చేకూర్చేందుకు గతంలో ఉన్న పథకాలను పటిష్టం చేస్తునే కొత్త వాటిని కూడా ప్రవేశపెట్టి వారి జీవనానికి ఒక భరోసా ఇచ్చింది ప్రభుత్వం. బిడ్డ జన్మించిన సందర్భంగా తల్లిబిడ్డ ఇద్దరి ఆరోగ్య రక్షణకు అమలు చేస్తున్న పోషకాహారం పథకం నుంచి అన్న అమృతహస్తం, ప్రసూతి సహాయం, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకాల ద్వారా అనేక వైద్య, ఆరోగ్య సేవలు అందిస్తోంది. 13 జిల్లా ఆసుపత్రులు, 23 బోధనాస్పత్రులు, 195 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 7548 ఆరోగ్య ఉప కేంద్రాల్లో వివిధ సేవలు అందుబాటులో ఉన్నాయి. తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను దాదాపుగా 7.20 లక్షల మంది వినియోగించుకున్నారు.
బాల్యానికి వచ్చే సరికి గిరి గోరుముద్దలు, ఎన్టీఆర్ బేబీ కిట్స్‌తో పాటు చిన్నారుల వాక్సినేషన్ ద్వారా లక్షలాది మంది పిల్లల ఆరోగ్య పరిరక్షణ చర్యలను ప్రభుత్వం తీసుకుంది. బేబీ రాప్, బేబీ టవల్, యాంటిసెప్టిక్ లోషన్, బేబీ అంబరిల్లాతో కూడిన ఎన్టీఆర్ కిట్‌లను దాదాపు ఏడు లక్షల మందికి అందజేసింది వైద్య
ఆరోగ్య శాఖ. బాల్యం తరువాత దశలో వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే స్ర్తి, పురుషులకు ఎన్టీఆర్ వైద్య సేవ, చంద్రన్న సంచార చికిత్సలు, ఎన్టీఆర్ వైద్య పరీక్షలు, మహిళా మాస్టర్ హెల్త్ పరీక్ష, ఉచిత డయాలసిస్, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య రక్ష... ఇలా అనేక పథకాలు, వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తేవడం అనేది దేశంలోనే అరుదైన ప్రయత్నం. ఇటువంటి పథకాలు సమర్థవంతంగా అమలయ్యే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌తో సహా అతి తక్కువగా ఉన్నాయి. చంద్రన్న సంచార చికిత్సను 4,02,912 క్లినిక్‌ల ద్వారా దాదాపుగా కోటి, 30 లక్షల మంది వినియోగించుకున్నారు. 46,76,926 పరీక్షలు నిర్వహించి కోటికి పైగా ఔషదాలు పంపిణీ చేశారు. ఉచిత డయాలసిస్ కింద 13 జిల్లాల్లో ఉన్న 48 కేంద్రాల్లో లక్షకు పైగా సెషన్లు నిర్వహించి సుమారు ఆరు వేల మందికి డయాలసిస్ ఉచితంగా అందించారు. ముఖ్యమంత్రి వైద్య కేంద్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 75.76 లక్షల మంది ఔట్ పేషంట్‌లకు వైద్యం అందించడమే కాకుండా ఏడు లక్షకు పైగా టెలీకన్సల్టెన్సీలను నిర్వహించారు. సుమారు అర కోటి వరకు బయోకెమిస్ట్రీ, క్లినికల్ పాథాలజీ, హెమటాలజీ పరీక్షలను ఉచితంగా నిర్వహించి పేదలకు అండగా నిలిచింది. వైద్య ఆరోగ్య శాఖ ఉచితంగా ఇచ్చే ఔషదాల జాబితా 564 (2014-15) నుంచి 751 (2018-19)కి పెరిగింది. ఔషదాలు బడ్జెట్ 194.8 కోట్ల రూపాయల (2014-15) నుంచి రూ. 402.56 కోట్లు (2018-19)కు పెరిగింది. అలాగే లబ్ధిదారుల సంఖ్య 11 కోట్ల (2014-15) నుంచి 2.65 కోట్లు (2018-19) మందికి పెరిగింది. ఇక విద్యార్థి స్థాయికి వచ్చాక మధ్యాహ్న భోజన పథకం, బడికొస్తా, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు కార్యక్రమాల ద్వారా పేద మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులుండే కుటుంబాలకు విస్తృతంగా లబ్ధి చేకూరుతోంది. మొత్తం మీద విద్యారంగంలో 2014-15లో రూ. 15681 కోట్లు కేటాయిస్తే 2018-19లో రూ. 24,961 కోట్లకు పెరిగింది. విద్య తర్వాత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందే సమయం వచ్చే సరికి ఈ రాష్ట్రంతోనూ తీసిపోని విధంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నరేగా, ఉద్యోగ సాధన కార్యక్రమాలను అమలు చేస్తోంది. నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ మేళాలు, నిరుద్యోగ భృతి, డ్వాక్రా సంఘాల మూల ధన నిధి వంటి సౌకర్యాల ద్వారా అనేక ఉద్యోగ అవకాశాలు సమకూర్చేలా అనేక చర్యలు తీసుకోవడంతో రాష్ట్రంలో యువతకు ఉద్యోగ భద్రత పెరుగుతూ వస్తోంది. ఇక కుటుంబ సంక్షేమానికి అమలు చేస్తున్న అనేక పథకాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న వర్గాల ప్రజల ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. కనీసం ప్రతి కుటుంబ ఆదాయం రూ. 10వేల ఉండాలనే లక్ష్యానికి చేరురవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిలో భాగంగా అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు చూస్తే...
రేషన్‌కార్డులు
2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 24 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి. 29,785 చౌకధర దుకాణాలు అందుబాటులో ఉన్నాయి.
ఎన్టీఆర్ భరోసా
ఒకప్పుడు పింఛన్ రూ. 200 వచ్చేది. అది ఇవ్వడానికే పాలకుల మనసు ఒప్పేదికాదు. అలాంటిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 1000 పెంచారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న వారి సంఖ్య 50 లక్షలు దాటింది. ఇందుకోసం ప్రభుత్వం రూ. 24.618.39 కోట్లు వ్యయం చేసింది
గృహ నిర్మాణం
గృహ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణ పథకం అత్యంత పారదర్శకంగా సాగుతోంది. గడచిన నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం రూ. 78,093 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదల కోసం 25.87 లక్షల గృహాలను మంజూరు చేసింది.
చంద్రన్న పెళ్లి కానుక
పేద కుటుంబాల్లో పెళ్లి అంటే ఓ వైపు ఆనందం మరో వైపు ఆర్థిక భావం. ఆడ పిల్లల తల్లిదండ్రులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని ప్రవేశపెట్టింది. 66,538 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మైనార్టీ ఆడ పిల్లలకు రూ. 269.17కోట్ల వ్యయంతో వివాహ ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోంది.
జగ్జీవన్ జ్యోతి పథకం
షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కుటుంబాలకు నెలకు 100 యూనిట్ల వరకు విద్యుత్ చార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తోంది.
చంద్రన్న బీమా
అసంఘటిత కార్మిక రంగంలోకి వచ్చే ప్రతి కార్మికుడి కుటుంబానికి రక్షణ కల్పంచాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిందే చంద్రన్న బీమా పథకం. ఈ పథకం కింద ఇప్పటి వరకు అసంఘటిత రంగంలో పని చేస్తున్న 1,93,819 మంది బాధిత కుటుంబాలకు రూ. 2,381 కోట్ల బీమాను ప్రభుత్వం చెల్లించింది.
అన్న క్యాంటీన్
అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే పేదలకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. అర్ధాకలితో అలమటిస్తున్న నిరుపేదల ఆకలి తీరుస్తున్నాయి. ఇప్పటి వరకు 1,65,46,367 మంది ప్రజలు అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం చేశారు. ఇందుకోసం రూ. 31.99 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించింది.
ఏటా రంజాన్ సందర్భంగా నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫా పేరుతో ఉచితంగా 4 రకాల సరుకులను అందజేస్తోంది ప్రభుత్వం. దీని కింద నాలుగేళ్లలో 11.25 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. క్రిస్మస్, సంక్రాంతి కానుకల ద్వారా నాలుగేళ్లలో రూ. 1.25కోట్ల కుటుంబాలకు లబ్ధి కలిగింది. ఐదేళ్లలో 30.61 లక్షల కొత్త వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు.
చిత్రం..కుప్పం ఆసుపత్రిలో చంటిబిడ్డ తల్లికి ఎన్టీఆర్ కిట్‌ను అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు (ఫైల్‌ఫొటో)