రాష్ట్రీయం

ఎవరెవరు?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 10: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం లభిస్తుందన్నది టీఆర్‌ఎస్‌లో సీనియర్ నాయకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మదిలో ఏముందన్నదీ పార్టీ వర్గాలు కూడా పసిగట్టలేకపోతున్నాయి. మంత్రిమండలి కూర్పుపై సీఎం కేసీఆర్ ఒక్కరే కసరత్తు చేస్తోన్నట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో గతంలో మంత్రులుగా పని చేసిన నాయకులు కూడా తమకు కచ్చితంగా అవకాశం ఉండేది లేనిదీ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మంత్రి పదవులు ఆశిస్తోన్న ఆశావాహులు భగవంతుని మీద భారం వేసి దైవ దర్శనాలకు వెళ్లి వస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన కడియం శ్రీహరి, హోంమంత్రిగా పని చేసిన నాయిని నరసింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వంటి సీనియర్లకు ఈసారి మంత్రిమండలిలో స్థానం లభిస్తుందా? లేదా? అనే విషయం కూడా పార్టీ సీనియర్ నాయకులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. మరో వారం రోజుల వరకూ ఇదే సస్పెన్స్ కొనసాగే అవకాశం లేకపోలేదు. ఈ నెల 17న శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం కోసం శాసనసభ సమావేశం కాబోతుంది. 17న ఏకాదశి, 19న త్రయోదశి కావడంతో ఈ రెండు రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయి. శాసనసభ మొదటి రోజు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమమే ఉండటంతో 19న త్రయోదశి శుభముహుర్తం రోజున మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్‌లో విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మంత్రివర్గ విస్తరణలో పూర్తిస్థాయిలో అన్ని పదవులు భర్తీ అవుతాయా? లేదా? అనేది కూడా ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ నుంచి సంకేతాలు లేవు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో ముగిసిన తర్వాతనే పూర్తిస్థాయిలో మంత్రిమండలి ఏర్పాటయ్యే అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు మంత్రి పదవులకు సంబంధం ఏమిటీ? పూర్తిస్థాయి మంత్రిమండలినే ఏర్పాటు చేసినా ఆశ్చర్యం లేదని మరో వాదన పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గట్టిగా కృషి చేయడానికి మంత్రిమండలిలో కొన్ని ఖాళీలను భర్తీ చేయకుండా అలానే ఉంచుతారన్నది మరో వాదన. శాసనసభ్యుల సంఖ్య ప్రకారం తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలిలో ముఖ్యమంత్రితో సహా 18 మందికి మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ ఇద్దరితో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఇంకా 16 మందికి మంత్రిమండలిలో అవకాశం ఉంది. మంత్రి పదవులకు సమానమైన హోదా కలిగిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ మూడు పదవులు కూడా మంత్రిమండలితో పాటు భర్తీ కావాల్సి ఉంది. సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా నుంచి, హోంమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో ఉమ్మడి 10 జిల్లాల్లో రెండు జిల్లాలకు ఇప్పటికే మంత్రిమండలిలో ప్రాతినిథ్యం లభించింది. మిగిలిన 8 ఉమ్మడి జిల్లాల నుంచి జిల్లాకు ఇద్దరి చొప్పున అవకాశం కల్పించినా సరిపడ సంఖ్యలో 16 ఖాళీలు ఉన్నాయి. అయితే హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, వరంగల్ నుంచి ఇద్దరి కంటే ఎక్కువ మందికి సామాజిక వర్గాల సమీకరణల ప్రకారం మంత్రిమండలిలో అవకాశం కల్పించాల్సి ఉంది. ఖమ్మం జిల్లా నుంచి పాలకపక్షం నుంచి ఒక ఎమ్మెల్యేనే గెలుపొందడంతో మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాకు అవకాశం ఉంటుందా? అనేది అనుమానమే. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అతి తక్కువగా 9 నియోజకవర్గాలు మాత్రమే ఉండగా టీఆర్‌ఎస్ నుంచి 8 మంది గెలుపొందారు. గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉండటంతో ఆ జిల్లా నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక్కరికే మంత్రి మండలిలో అవకాశం ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మెదక్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం ఉండటంతో ఆ జిల్లా నుంచి గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన హరీశ్‌రావుతో పాటు డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన పద్మాదేవేందర్‌రెడ్డి రేస్‌లో ఉంటారు. మహిళా కోటాలో పద్మాదేవేందర్‌రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి 10 జిల్లాల్లో మెదక్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలను మినహాయిస్తే మిగిలిన ఏడు జిల్లాల్లో హైదరాబాద్ జిల్లా నుంచి ఇప్పటికే ఎమ్మెల్సీ మహమూద్ అలీకి మంత్రిమండలిలో ప్రాతినిథ్యం లభించింది. హైదరాబాద్ నుంచి గత మంత్రివర్గంలో నలుగురికి అవకాశం లభించడంతో ఈ సారి మంత్రివర్గంలో ఇంకా ఇద్దరికైనా అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. వీరిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, దానం నాగేందర్, నాయిని నరసింహారెడ్డి రేస్‌లో ఉన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్ నాలుగు జిల్లాలు పోగా ఇంకా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఆరు జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించాల్సి ఉంటుంది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి గతంలో మంత్రిగా పని చేసిన లక్ష్మారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మంత్రి పదవుల రేస్‌లో ఉన్నారు. మంత్రిమండలిలో కొత్త వారికి అవకాశం కల్పించనున్న వారిలో నిరంజన్‌రెడ్డి పేరు అగ్రభాగంలో ఉన్నట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లా నుంచి కోడంగల్ నుంచి ఉహించని విజయం సాధించిన పట్నం నరేందర్‌రెడ్డికి, కూకట్‌పల్లి నుంచి రెండవసారి గెలుపొందిన మాధవరం కృష్ణారావు రేస్‌లో ఉండే అవకాశం ఉంది. వరంగల్ జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్ (ఎస్టీ కోటా), దాస్యం వినయ్ భాస్కర్ రేస్‌లో ఉంటారని అంచన. ఆదిలాబాద్ జిల్లా నుంచి గతంలో మంత్రులుగా పని చేసిన ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, బాల్కా సుమన్ (ఎస్సీ కోటా) రేస్‌లో ఉండే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లా నుంచి గతంలో మంత్రులుగా పని చేసిన కేటీఆర్, ఈటలతో పాటు ఎస్సీ కోటాలో ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ రేస్‌లో ఉన్నారు. ఈటల రాజేందర్ పేరును స్పీకర్ పదవికి పరిశీలిస్తోన్నట్టు మరో సమాచారం. ఈటలకు స్పీకర్ పదవి ఇచ్చే పక్షంలో జిల్లా నుంచి ఇద్దరికి మంత్రిమండలిలో అవకాశం ఉండవచ్చని అంచనా.